E-Paper
Advertisement

శభాష్ అమ్మాయిలు…శ్రీలంక ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

శభాష్ అమ్మాయిలు…శ్రీలంక ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్
Advertisement

Team India Win Gold Medal:  ఏషియన్స్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్స్ మ్యాచ్ లో శ్రీలంక మహిళల జట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా మహిళల టీమ్, గోల్డ్ మెడల్ దక్కించుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఇరగదీసిన హర్మన్ ప్రీత్ కౌర్ టీమ్… పసిడి పతకం అందుకుంది.

శభాష్ అమ్మాయిలు…శ్రీలంక ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

మహిళల ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో (Asian Games 2026) భాగంగా, ఇవాళ టీమిండియా, శ్రీలంక జట్ల ( India Women vs Sri Lanka Women) మధ్య ఫైనల్స్ జరిగింది. గోల్డ్ మెడల్ కోసం జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఉమెన్స్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది టీమిండియా. షెఫాలీ వర్మ 48 పరుగులు చేయగా, స్మృతి మందాన 79 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 19 పరుగులే చేయగా, రిచా ఘోష్ మాత్రం అదరగొట్టింది. 22 బంతుల్లో 49 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది. ఇక ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు అట్టర్ ఫ్లాఫ్ అయింది.

Advertisement

214 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది.  15.4 ఓవర్లు ఆడిన శ్రీలంక ఉమెన్స్ టీమ్… 69 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో 147 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ అందుకున్న టీమిండియా, గోల్డ్ సంపాదించింది. ఛేజింగ్ లో మహిళల శ్రీలంక జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు ఒక్కరే 29 పరుగులతో రాణించే ప్రయత్నం చేశారు. మిగతా ఆటగాళ్లు అందరూ అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. దీప్తి శర్మ ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు సంధించింది. ఈ క్రమంలో 6 పరుగులు ఇచ్చి, 3 వికెట్లు పడగొట్టింది. అటు షఫాలీ వర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణీ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు

పాకిస్తాన్ ఖాతాలో కాంస్య పతకం

Advertisement

ఏషియన్స్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో తొలి మ్యాచ్ ఓడిపోయినా, పాకిస్తాన్ ఉమెన్స్ జట్టుకు కాంస్య పతకం వచ్చింది. కాంస్య పతకం కోసం ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఇందులో బంగ్లాదేశ్ జట్టును చిత్తుగా ఓడించింది పాకిస్తాన్. బంగ్లాపై ఏకంగా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే కాంస్య పతకం దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్..20 ఓవర్లు ఆడి, 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు సాధించింది. ఈ టార్గెట్ ఛేదించే క్రమంలో 7 వికెట్లు నష్టపోయి, కేవలం 114 పరుగులే చేసి..ఓడిపోయింది బంగ్లాదేశ్ ఉమెన్స్ టీమ్.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

Related News

అభిషేక్ శర్మ డకౌట్…అల్లాడించిన పసికూన జపాన్‌, అతి కష్టమీద గెలిచిన టీమిండియా

సౌర‌వ్ గంగూలీ కెప్టెన్సీలో తాను ఆడింటే, నా త‌ల‌రాత మారేంది

క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని టీమిండియా ఆడుతుంది..అందుకే ఈ సారి ఓడిస్తాం

ఐపీఎల్ వ‌ల్లే, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల పొగ‌రు దిగింది..రాబిన్ ఉతప్ప సంచ‌ల‌నం

మా పాకిస్తాన్ ప్లేయర్లు కోతుల కంటే దారుణం… వాటి కంటే ఎక్కువ అరటి పండ్లు మెక్కుతున్నారు !

CSK జ‌ట్టులో మ‌ళ్లీ ఫిక్సింగ్ క‌ల‌కలం..ఒక్క లీక్ రూ.70 ల‌క్ష‌లు ?

బాబర్ ఆజంను విమర్శిస్తే, పళ్ళు రాలగొడతా… వసీం అక్రమ్ కు తన్వీర్ అహ్మద్ హెచ్చరిక

Big Stories

Advertisement
×