Stuart Broad: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (India tour of England, 2026) మధ్య ఐదు టి20 లు అలాగే 3 వన్డేలు జరగనున్నాయి. జులై ఒకటో తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టి20 కోసం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని (VAIBHAV SOORYAVANSHI) భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలెక్ట్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తో జరిగే టి20 సిరీస్ కోసం వైభవ్ సిద్ధమవుతున్నాడు. అంతేకాదు ఈ టోర్నమెంట్ లో భాగంగా అభిషేక్ శర్మతో పాటు వైభవ్ ఓపెనర్ గా దిగుతాడని కూడా అంటున్నారు. అయితే ఈ అంశంపై ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ( Stuart Broad) సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ బాగా ఆడుతున్నాడని మెచ్చుకుంటూనే, అతన్ని త్వరగా పెవిలియన్ ను పంపే ప్రయత్నం చేస్తామని హెచ్చరించారు. స్లెడ్జింగ్ చేసి మరి.. వైభవ్ ను రెచ్చగొడతామని బాంబు పేల్చారు. గ్రౌండ్ లో ప్లేయర్లను స్లెడ్జింగ్ చేయడంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఎప్పుడు ముందు ఉంటారని గుర్తు చేశారు. స్లెడ్జింగ్ చేస్తే వైభవ్ టెంప్ట్ అయి, త్వరగా వికెట్ సమర్పించుకోవడం గ్యారెంటీ అన్నారు.
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జులై లో జరగనున్న 5 టీ20 ల సిరీస్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ ఇంగ్లాండ్ పర్యటనకు రాకముందే భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశ క్రికెటర్లు, మాజీలు. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీని డకౌట్ చేస్తానని, జోఫ్రా ఆర్చర్ వార్నింగ్ ఇచ్చారు. లేటెస్ట్ గా మాజీ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్టు బ్రాడ్ కూడా ఇదే తరహాలో స్పందించారు. స్లెడ్జింగ్ చేసి వైభవ్ ను అవుట్ చేయడం గ్యారంటీ అని తెలిపారు. గ్రౌండ్ లోకి దిగగానే తమ ప్లేయర్లు స్లెడ్జింగ్ చేయడం మొదలు పెడతారని.. ఆ దెబ్బకు సహనం కోల్పోయి, వైభవ్ వికెట్ సమర్పించుకుంటాడని తెలిపారు.
ఇంగ్లాండ్ తో జరగనున్న టి20 సిరీస్ నేపథ్యంలో, వైభవ్ తొలి మ్యాచ్ లోనే బరిలోకి దిగుతాడని అంచనా వేశారు స్టువర్టు బ్రాడ్. ఇలాంటి క్రమంలో అతని కోసం అస్త్రాలను ఇంగ్లాండు సిద్ధం చేసుకోవాలని కోరాడు. అభిషేక్ శర్మతో వైభవ్ ఓపెనింగ్ చేస్తాడని కూడా వివరించారు. ప్రస్తుతమైతే వైభవ్ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్, అతన్ని తట్టుకోవడం చాలా కష్టమే, కానీ స్లెడ్జింగ్ చేసి.. రెచ్చగొట్టాలని తమ ప్లేయర్లకు సూచనలు చేశారు. దీంతో స్టువర్టు బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.