BigTV English

Riley Meredith : వీడు మనిషా.. పశువా…. దెబ్బకు వికెట్ రెండుగా చీలిపోయింది… బౌలర్ ను చూసి వణికి పోవాల్సిందే

Riley Meredith : వీడు మనిషా.. పశువా…. దెబ్బకు వికెట్ రెండుగా చీలిపోయింది… బౌలర్ ను చూసి వణికి పోవాల్సిందే

 Riley Meredith :  సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరగుతుందో ఊహించడం పెద్ద కష్టం అనే చెప్పాలి.  ముఖ్యంగా ఏ బౌలర్ ఎప్పుడూ చెలరేగుతాడో.. లేక ఏ బ్యాటర్ ఎప్పుడూ రెచ్చిపోతారో అర్థం కాదు. కొంత మంది ఒక ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. తరువాత ఇన్నింగ్స్ లో డకౌటో లేదో తక్కువ స్కోర్ కే పరిమితం అవుతారు. మరోవైపు అలాగే కొంత మంది బౌలర్లు ఒక ఇన్నింగ్స్ లో చెత్త బౌలింగ్ చేస్తే.. మరో ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో బౌలర్లు వేసే బంతులకు వికెట్లు ఎగిరి దూరంగా పడటం.. మరికొన్ని సందర్భాల్లో వికెట్లు కూడా విరిగిపోవడం జరుగుతుంటుంది. ఇది చాలా అరుదు అనే చెప్పాలి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ రిలే మెరెడిత్ వేసిన బంతికి వికెట్ రెండు గా చీలిపోవడం విశేషం.


Also Read : Watch Video : ఇదెక్కడి బౌలింగ్ రా… బుడ్డోడు వేసిన బంతికి నడ్డి విరిగింది.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

భారీ తేడాతో విజయం.. 


ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఇంగ్లాండ్ T 20 బ్లాస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ బ్లాస్ట్ లో  సోమర్ సెట్ వర్సెస్ ఎసె*క్స్ కి జరిగిన మ్యాచ్ లో వికెట్లు విరిగిపోయాయి. ఎసె*క్స్ ఓపెనర్ మైఖేల్ పెప్పర్ కి మెరెడిత్ బౌలింగ్ చేశాడు. అతను వేసిన బంతి వికెట్ ని తాకడమే కాదు.. ఏకంగా వికెట్ ని గొడ్డలితో నరికినట్టుగా రెండు ముక్కలుగా చీలిపోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్ సెట్ జట్టు 95 రన్స్ తేడాతో విజయం సాధించింది. సోమర్ సెట్ బ్యాటర్లలో టామ్ బ్యాంటన్ 15, విల్ స్మీద్, కాడ్మోర్ 90, అబెల్ 20, డిక్సన్ 28, గ్రీన్ 13, గ్రెగోరీ 18 పరుగులు చేయడం..వీరికి ఎక్స్ ట్రాల రూపంలో మరో 9 పరుగులు రావడంతో  20 ఓవర్లలో సోమర్ సెట్ జట్టు 225/6 పరుగులు చేసింది.

మెరెడిత్ దెబ్బతో సోమర్ సెట్ అగ్రస్థానం.. 

ఎస్సెస్ జట్టు బ్యాటింగ్ ని పరిశీలించినట్టయితే.. మైఖేల్ పెప్పర్ 13, వాల్తర్ 24, జోర్డన్ 01, చార్జి ఎలిసన్ 10, థెయిన్ 38, రోబిన్ దాస్ 17, సిమన్ హార్మర్ 20, అమీర్ 05, బెన్ కెన్ స్టిన్, బెన్నెట్ లు డకౌట్ అయ్యారు. కేవలం 14.1 ఓవర్లలోనే 130 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో సోమర్ సెట్ జట్టు 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు సోమర్ జట్టు పాయింట్ల పట్టికలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎస్సెస్ జట్టు పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగడం గమనార్హం. గత ఏడాది కూడా మెరెడిత్ సోమర్ సెట్ జట్టు తరుపున ఆడాడు. ఇక ఈ మ్యాచ్ లో 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెరిడిత్ 22/2 తో ముగించాడు. దీంతో సోమర్ సెట్ జట్టు క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం సోమర్ సెట్ బౌలర్ మెరిడిత్ వేసిన బంతి.. వికెట్ విరిగిపోయే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడు మనిషా.. పశువా.. వీడి దెబ్బకు వికెట్ రెండుగా చీలిపోయిందేందిరా బాబు. ఈ బౌలర్ ని చూస్తే.. వణికి పోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం విశేషం.

Related News

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. హరీస్ రవుఫ్ పై బ్యాన్..!

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

Rohith Sharma : మ‌రోసారి 10 కిలోలు తగ్గిన రోహిత్ శ‌ర్మ‌…ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

Big Stories

×