BigTV English

IND vs AUS: బంగ్లాకు ట్రైలర్‌ మాత్రమే..ఆస్ట్రేలియాకు సినిమా చూపించనున్న టీమిండియా..?

IND vs AUS: బంగ్లాకు ట్రైలర్‌ మాత్రమే..ఆస్ట్రేలియాకు సినిమా చూపించనున్న టీమిండియా..?

IND vs AUS: టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన తర్వాత… దుమ్ములేపుతోంది టీమిండియా. వరుసగా మ్యాచ్‌ లు గెలుచుకుంటూ ముందుకు వెళుతోంది. ఈ మధ్య జరిగిన కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ కి ఊహించని ఎదురుదెబ్బ ఇచ్చింది టీమిండియా. 2-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన. గౌతమ్ గంభీర్ గైడెన్సీలో టీమిండియా అద్భుతంగా చెలరేగి ఆడింది. భారత జట్టు కొత్త అవతారాన్ని చూసామంటూ క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా అశ్విన్ పేరు మార్మోగిపోతోంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను అశ్విన్ నిలిచాడు. రీసెంట్ గా బీసీసీఐ మాజీ సెలెక్టర్ జతిన్ పరంజపే… అశ్విన్ పై ప్రశంసలు కురిపించాడు.


Also Read: IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

వచ్చే ఐదు సంవత్సరాలు అతనివేనన్నాడు. అతని బౌలింగ్ చూస్తే చాలా సంతోషంగా అనిపించిందని చెప్పాడు. అంతేకాదు కాన్పూర్ టెస్టు కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ తో మొత్తం సినిమా చూపిస్తారని చాలా కాన్ఫిడెంట్ గా జతిన్ చెప్పాడు. ఆస్ట్రేలియాలో అశ్విన్ ఇంకా అదరగొడతాడని, తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుందని, వారి బ్యాటింగ్ తీరు నా ఫేవరెట్ అని చెప్పుకోచ్చాడు. మొత్తానికి టీమిండియాపై జతిన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


Also Read: Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం t20 సిరీస్ జరుగుతోంది. ఇందులో మొదటి మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. బంగ్లాదేశ్ చెట్టు పైన ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది టీమిండియా. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో… టీమిండియా ఈ టి 20 మ్యాచ్ లో అదరగొట్టింది.మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా చేదించగలిగింది. మరో రెండు టీ20 మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండు కూడా టీమిండియా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనెల 9వ తేదీన రెండవ టి20 అలాగే 12వ తేదీన మూడవ టి20 జరగనుంది.

Related News

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

Big Stories

×