E-Paper
Advertisement

మా హోట‌ల్ రూంకు వ‌చ్చి, కొడ‌తాన‌ని షోయ‌బ్ అక్త‌ర్ వార్నింగ్ ఇచ్చాడు

మా హోట‌ల్ రూంకు వ‌చ్చి, కొడ‌తాన‌ని షోయ‌బ్ అక్త‌ర్ వార్నింగ్ ఇచ్చాడు
Advertisement

Harbhajan Singh On Shoaib Akhtar:  పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( Pakistan vs. Team India) మధ్య మ్యాచ్ లు అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. 2008 తర్వాత ఈ రెండు దట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు కాగా.. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో జరిగే మ్యాచ్ ల‌లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ పరిస్థితులు ఉన్నాయి. అంతకు ముందు పాకిస్తాన్ కు ఇండియా వెళ్ళేది.. ఇండియాకు పాకిస్తాన్ వచ్చేది. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు అద్భుతంగానే జరిగాయి. ఈ క్రమంలోనే గతంలో జరిగిన ఓ సంఘటనను హర్భజన్ సింగ్ పంచుకున్నారు. 2004 సమయంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగగా.. తనతో పాటు యువరాజ్ సింగ్ ను హోట‌ల్ రూముకు వచ్చి కొడతానని షోయబ్ అక్తర్ వార్నింగ్ ఇచ్చినట్లు హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అక్త‌ర్ దున్న‌పోతులా ఉండేవాడు..అందుకే తాము భ‌య‌ప‌డిపోయాం !

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) 2004 సమయంలో జరిగిన ఓ సంఘటనను తాజాగా గుర్తు చేసుకున్నారు. 2004 సమయంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs. Team India) మ్యాచ్ ముగిసిన తర్వాత తమకు షోయబ్ అక్త‌ర్ (Shoaib Akhtar) వార్నింగ్ ఇచ్చాడని హర్భజన్ సింగ్ గుర్తు చేశారు. యువరాజ్ సింగ్ తో పాటు తనను హోటల్ రూమ్ కు వచ్చి కొడతానని షోయబ్ అక్తర్ వార్నింగ్ ఇచ్చినట్లు హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. దీంతో తాము భయపడిపోయామని వెల్లడించారు. అతడు చెప్పినట్లు గానే, తన హోటల్ రూమ్ కు షోయబ్ అక్తర్ వచ్చాడని ఈ వివరించారు. ఆ సందర్భంగా యువరాజ్ సింగ్ కూడా తన రూమ్ లోనే ఉన్నాడని పేర్కొన్నారు. ఇక భారీ కాయం ఉన్న షోయబ్ అక్తర్ ను తాము భయపడిపోయామని వెల్లడించారు హ‌ర్భ‌జ‌న్ సింగ్.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

అక్త‌ర్ కొడితే, యువ‌రాజ్ సింగ్ ఓ మూల‌న ప‌డిపోయాడు

వాస్తవానికి తమను కొట్టేందుకు షోయబ్ అక్తర్ తమ రూమ్ కు రాలేదని క్లారిటీ ఇచ్చారు. స‌ర‌దాగా కుస్తీ పోటీ ఆడదామని, ఈ సందర్భంగా తమకు అసలు విషయం చెప్పాడని షోయబ్ అక్తర్ సన్నివేశం గురించి కీలక విషయాలను పంచుకున్నారు. ఈ కుస్తీ పోటీలో కూడా తమపై షోయబ్ అక్తర్ గెలిచాడన్నారు. ఈ ఫైట్ సందర్భంగా యువరాజ్ సింగ్ ను నెట్టేస్తే, ఓ మూలన వెళ్లి పడ్డాడని ఫన్నీ కామెంట్స్ చేశారు. తాను కూడా కింద పడిపోయానని పేర్కొన్నారు. ఆ తర్వాత సరదాగా మళ్లీ కలిసి పోయామని వివరించారు హర్భజన్ సింగ్. రెండు దేశాల మధ్య గొడవలు ఉన్నప్పటికీ హోటల్ రూమ్ లో తాము సరదాగా ఉండే వాళ్ళమని చెప్పుకొచ్చారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

Related News

23 ఏళ్ల కింద‌ట అవ‌మానం…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పైనే ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లా

మెట్ల‌పైనే కుప్ప‌కూలిన‌ కేఎల్ రాహుల్…బీసీసీఐ చేత‌గానీ త‌న‌మే కార‌ణమంటూ విమ‌ర్శ‌లు !

గాయాల పేరుతో బుమ్రా డ్రామాలు..1000 జ‌న్మలు ఎత్తినా వ‌సీం అక్ర‌మ్ స్థాయికి చేరుకోడు!

ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నాన‌ని, దేశద్రోహి ముద్ర వేశారు

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి, గౌర‌వించండి.. బీసీసీఐపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు!

ఇప్పుడే సంబ‌రాలే చేసుకోవ‌ద్దు..బంగ్లాదేశ్ కు ర‌మీజ్ రాజా హెచ్చ‌రిక‌

డేవిడ్ వార్న‌ర్ పోస్ట్ వైర‌ల్…జాతీయ జెండాను అవ‌మానించాడంటూ ట్రోల్స్‌ !

Big Stories

Advertisement
×