IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ప్రారంభం కంటే ముందు… ప్లేయర్ లందరికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఊహించని షాక్ ఇచ్చింది. కొత్త రూల్స్ అమల్లోకి తీసుకు వస్తున్నట్లు తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) ప్రకటన చేసింది. ఇకపై ఐపీఎల్ మ్యాచ్ లలో ( IPL 2025) స్లీవ్ లెస్ ( SLEEVELESS JERSEYS BANNED ) అసలు వేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మ్యాచ్ లో కూడా… ప్లేయర్ లందరూ స్లీవ్ లెస్ జెర్సీ ధరిస్తూ ఉంటారు.
Also Read: Deepthi Jeevanji: దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం..సీఎం రేవంత్ ఆదేశాలు !
ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చేటప్పుడు… తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డగౌట్ లో కూర్చునే ప్లేయర్లు.. అందరూ కూడా స్లీవ్ లెస్ జెర్సీ ధరించి… కాస్త రిలాక్స్ అవుతూ ఉంటారు. అయితే ఇకపైన అలాంటి.. పనులు అస్సలు నడవబోవని… తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ లో ఇకపైన స్లీవ్ లెస్ అస్సలు వేసుకోకూడదని తెలిపింది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ప్రారంభం నుంచి… ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నట్లు.. నేషనల్ మీడియా కథనాలు ప్రచురణ చేస్తోంది.
అలాగే… ప్లేయర్ల కుటుంబ సభ్యులను, మిత్రులను కానీ డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకు రాకూడదని… మరో కండిషన్ పెట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అటు.. జట్టు యాజమాన్యం ఇచ్చిన బస్సులో మాత్రమే… గ్రౌండ్ కు రావాలని కూడా హెచ్చరించింది. ప్రైవేట్ వాహనాలు అస్సలు వాడకూడదని కూడా… వార్నింగ్ ఇవ్వడం జరిగింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే.. కఠిన శిక్షలు ఉంటాయని తెలిపింది. ఇక పై ఈ రూల్స్ మొదటిసారి బ్రేక్ చేస్తే వార్నింగ్ తో సరిపెడతామని… మరోసారి రిపీట్ అయితే ఫైన్ కూడా వేస్తామని హెచ్చరించింది. దీంతో ఇకపైన… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో స్లీవ్ లెస్ జెర్సీతో ఏ ప్లేయర్ కనబడబోడు అన్నమాట. కండలు చూపించడం… ఎక్స్పోజింగ్ చేయడం.. లాంటివి ఇక పైన గ్రౌండ్ లో అసలు కుదరదు.
Also Read: IND VS NZ: టీమిండియాకు గండంగా మారిన ఆదివారం… ఫైనల్ లో ఓడిపోవడమేనా ?
ఇక బీసీసీఐ రూల్స్ పై ఐపీఎల్ ప్లేయర్లు ఆగ్రహంగా ఉన్నారట. కాగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మే 25 వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. మొదటి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ బెంగళూరు మధ్య జరుగనుంది.
🚨 SLEEVELESS JERSEYS BANNED. 🚨
– The BCCI has banned floppies and sleeveless jerseys during IPL post match presentation.
– Players breaching this will receive a warning in the 1st instance.
– There will be a financial penalty from the 2nd instance onwards. (Cricbuzz). pic.twitter.com/wGu2oOFqTL
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2025