BigTV English

Non-Vegetarians: ఆ రాష్ట్రంలో 99 శాతం మంది మాంసాహారులే.. నాన్ వెజ్ మరీ అంతలా తినేస్తారా?

Non-Vegetarians: ఆ రాష్ట్రంలో 99 శాతం మంది మాంసాహారులే.. నాన్ వెజ్ మరీ అంతలా తినేస్తారా?

Non-Vegetarian State: మన దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. అంతకు మించి విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని రకాల వంటలు మన దేశంలోనే ఉంటాయి. చాలా వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి.  అయినప్పటికీ ఎక్కువ మంది శాకాహారాన్ని తీసుకునేందు ఇష్టపడుతారు.  అయితే, సౌత్ లో శాకాహారం, మాంసాహారం కలిపి తింటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శాకాహారం ఎక్కువగా తీసుకుంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మాంసాహారం తీసుకుంటారు. అయితే, దేశంలోని ఓ రాష్ట్రంలో అత్యధికంగా మాంసాహారం తీసుకునే ప్రజలు ఉన్నారు. ఇక్కడ 99% జనాభా మాంసాహారులే కావడం విశేషం. అక్కడ శాకాహార చాలా తక్కువగా దొరుకుతుంది. రెస్టారెంట్లలో కూడా ఎక్కువగా మాంసాహారమే దొరుకుతుంది. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదో తెలుసుకోవాలనుందా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే!


దేశంలో 99 శాతం మాంసాహారులు ఉండే రాష్ట్రం!

దేశంలో ఎక్కువ మంది శాకాహారం ఇష్టపడినా ఓ రాష్ట్రంలో మాత్రం అత్యధిక మంది మాంసాహారాన్ని తినేందుకు ఇష్టపడుతారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ శాకాహారులు చాలా తక్కువ మంది అంటే.. కేవలం ఒకశాతం మందే ఉంటారు. ఈ రాష్ట్రంలోని 99 శాతం మంది మాంసాహారులు ఉన్నారు. ఆ రాష్ట్రం మరేదో కాదు నాగాలాండ్. ఈ రాష్ట్రంలో శాకాహారులు వెతికినా కనిపించరు. ఈ రాష్ట్రంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతుంది. ఇక్కడ జనాభా అంతా దాదాపు మాంసాహారులే.


సంప్రదాయ వంటకాలన్నీ మాంసంతో తయారు చేసినవే!

నాగాలాండ్‌ లోని సాంప్రదాయ వంటకాల్లో ఎక్కువ భాగం మాంసంతో తయారు చేస్తారు. ఇక్కడి ఆహారంలో మిరపకాయలు, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉడికించిన కూరగాయలు, బియ్యం, కారంగా ఉండే చట్నీలతో కూడిన ఆహార పదార్థాలను ఇక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. కాల్చిన మాంసం, చేపలు నాగా సంస్కృతిలో ప్రధాన ఆహారం. ఇక్కడి ప్రజలు ఈ ఫుడ్స్ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక్కడ ఎవరి ఇంట్లో చూసినా నాన్ వెజ్ వంటలే దర్శనం ఇస్తాయి. అందుకే, దేశంలో ఎక్కువ మంది మాంసాహారం తినే రాష్ట్రాల్లో తొలిస్థానంలో నాగాలాండ్ నిలిచింది.

Read Also: ఆ పండు తిన్న ఆర్టీసీ డ్రైవర్.. ఆల్కహాల్ టెస్ట్ లో పాజిటివ్, అసలు దోషి ఎవరంటే?

శాఖాహారుల సంగతేంటి?

నాగాలాండ్ లో శాకాహారం చాలా వరకు లభించదు. ఎక్కడో అరుదుగా దొరుకుతుంది. ఇక్కడి రెస్టారెంట్లలో వెబ్ ఫుడ్ చాలా తక్కువగా లభిస్తుంది. ఒకవేళ శాకాహారులుగా ఉండి, నాగాలాండ్ కు వెళ్లే అవకాశం ఉంటే, తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఎందుకంటే, అక్కడ శాకాహారం అరుదుగా దొరుకుతుంది. వీలుంటే, మీరు వెళ్లి వచ్చే వరకు సరిపడ నాన్ వెజ్ వంటసామాగ్రిని తీసుకెళ్లడం ఉత్తమం. లేదంటే, అక్కడికి వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మాంసాహారం తినే టూరిస్టులు అయితే, రకరకాల మాంసాహారాలను రుచి చూసే అవకాశం ఉంటుటుంది.

Read Also:  తానే నా పెళ్ళాం అంటూ 760 కిలోమీటర్లు కష్టపడి వెళ్ళాడు.. ఆమె భర్త ఎదురయ్యేసరికి..

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×