Trolls On Vaibhav: ట్రై సిరీస్ లో భాగంగా నిన్న శ్రీలంక వర్సెస్ టీమిండియా ఏ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన శ్రీలంక విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సూపర్ ఓవర్ లో ఎంపైర్లు.. శ్రీలంకకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని టీమిండియా ప్లేయర్లు గొడవకు దిగారు. అంతేకాదు సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత వైభవ్ ను అనవసరంగా గెలికారు శ్రీలంక క్రికెటర్లు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. శ్రీలంక గడ్డపై అక్కడి ప్లేయర్ల కాలర్లు పట్టుకున్నాడు. ఏ మాత్రం వెనక్కి అడుగు వేయకుండా శ్రీలంక క్రికెటర్లకు తగ్గిన బుద్ధి చెప్పాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
టీమిండియా ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీని అనవసరంగా రెచ్చగొట్టారు శ్రీలంక క్రికెటర్లు. ఈ క్రమంలో నిన్న మైదానంలో రెండు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ రాజుకుంది. ఇది ఐపీఎల్ కాదని.. అంతర్జాతీయ క్రికెట్ అంటూ వైభవ్ ను రెచ్చగొట్టారు. దీంతో రెచ్చిపోయిన వైభవ్ శ్రీలంక క్రికెటర్ల కాలర్లు పట్టుకున్నాడు. అయితే స్టేడియంలో శ్రీలంక ప్లేయర్లు తప్పిదం చేసిన కూడా… వైభవ్ ను విలన్ చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. ఇతర ప్లేయర్ లందరూ 15 ఏళ్ల బుడ్డోడిని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. అయితే అతి కోపంతో కెరీర్ పోగొట్టుకోకూడదని వైభవ్ కు అభిమానులు సూచనలు చేస్తున్నారు. వాళ్లు రెచ్చగొట్టినంత మాత్రాన నువ్వు రెచ్చిపోకూడదని… మహేంద్ర సింగ్ ధోనీ లాగా కాస్త కూల్ గా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు.
అయితే స్టేడియంలో కోపంతో ఊగిపోయిన వైభవ్… బయట మాత్రం పెద్దలకు గౌరవం ఇస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. మైదానంలో శ్రీలంక ప్లేయర్ల కాలర్లు పట్టుకున్న వైభవ్… మ్యాచ్ ముగిసిన తర్వాత అదే శ్రీలంక మొట్ట మొదటి వన్డే కెప్టెన్ అనుర తెన్నకూన్ (Anura Tennakoon) పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సంఘటన కూడా హాట్ టాపిక్ అయింది. దీంతో వైభవ్ కు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఇదంతా పడని వాళ్ళు ఊసరవెల్లిలా వైభవ్ రంగులు మార్చుతున్నాడని మళ్లీ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. తనపై బ్యాన్ విధిస్తారన్న భయంతో… శ్రీలంక మాజీ క్రికెటర్ల కాళ్లు పట్టుకుంటున్నాడని కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు.
Vaibhav Sooryavanshi paid his respects by touching the feet of former Sri Lankan captain Anura Tennekoon, who had specially waited to meet him 😇🙏#VaibhavSooryavanshi #CricketTwitter pic.twitter.com/p08DU7IFPl
— InsideSport (@InsideSportIND) June 16, 2026