E-Paper
Advertisement

Usman Tariq: ధోని సాయం చేస్తే, CSK జ‌ట్టుకు ఆడ‌తా

Usman Tariq:  ధోని సాయం చేస్తే, CSK జ‌ట్టుకు ఆడ‌తా
Advertisement

Usman Tariq:  పాకిస్తాన్ వర్సెస్ ఇండియా (Pakistan vs. India) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పహాల్గాం సంఘటన తర్వాత టీమిండియా అలాగే పాకిస్తాన్ క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడమే మానేశారు. BCCI ఆదేశాల మేరకు టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) లాంటి దిగ్గజ క్రికెటర్ పై పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ (Usman Tariq) హాట్ కామెంట్స్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని అంటే తనకు ఇష్టమని.. అతడు సహాయం చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి (CSK Team) వస్తానంటూ ప్రకటించారు.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

ధోని సాయం చేస్తే, CSK జ‌ట్టుకు ఆడ‌తా – ఉస్మాన్ తారిక్ 

Advertisement

మహేంద్ర సింగ్ ధోని అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడాలనే ఆసక్తి తనకు ఉందని వెల్లడించారు. కానీ పాకిస్తాన్ ప్లేయర్లకు ఆ అవకాశం లేకపోవడం దారుణం అన్నారు. అయితే మహేంద్ర సింగ్ ధోని తనకు హెల్ప్ చేస్తే… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఉస్మాన్ తారిక్ కీలక వ్యాఖ్యలు చేశాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

మహేంద్ర సింగ్ ధోని కారణంగా సక్సెస్ అయిన ఉస్మాన్ తారిక్

టీమిడియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కారణంగానే పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ స్టార్ బౌలర్గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పదే పదే సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటాడు ఉస్మాన్ తారిక్. ఎక్కడ ఇంటర్వ్యూ జరిగిన మహేంద్ర సింగ్ ధోని జపం చేస్తూ ఉంటాడు. ధోని పెట్టిన బిక్ష వల్ల ఇక్కడ ఉన్నానంటూ చెబుతూ ఉంటాడు. పాకిస్తాన్ క్రికెట్ లోగి రాకముందు తాను యూఏఈ లో సేల్స్ మ్యాన్ గా పని చేశానని మరోసారి గుర్తు చేశారు ఉస్మాన్ తారిక్. అయితే ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోని మూవీ తాను చూసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ధోని లాగా క్రికెట్ ఆడాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టులోకి వచ్చి… సక్సెస్ అయినట్లు గుర్తు చేశారు. దీని అంతటికి కారణం మహేంద్రసింగ్ ధోని అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఉస్మాన్ తారిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

 

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

Related News

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

బ్యాటింగ్ చేయ‌కుండా, మైదానంలో రిజ్వాన్ రికార్డ్ డ్యాన్సులు చేస్తున్నాడు

Big Stories

Advertisement
×