E-Paper
Advertisement

తుఫాన్ లాంటి బ్యాట‌ర్ ను వాట‌ర్ బాయ్ చేస్తావా ? గంభీర్ పై వైభ‌వ్ కోచ్ సీరియ‌స్‌

తుఫాన్ లాంటి బ్యాట‌ర్ ను వాట‌ర్ బాయ్ చేస్తావా ? గంభీర్ పై వైభ‌వ్ కోచ్ సీరియ‌స్‌
Advertisement

Vaibhav Childhood Coach Lashes Out At Gambhir: టీమిండియా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి సరైన అవకాశాలు రావడం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంజు శాంస‌న్ కు అవకాశాలు ఇస్తున్న గౌతమ్ గంభీర్….వైభవ్ కు అసలు ఛాన్సులు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నాడని… అతడి కెరీర్ నాశనం చేస్తున్నారని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ కెరీర్ పై అతడి చిన్ననాటి కోచ్ మ‌నీష్ ఓజా రియాక్ట్ అయ్యారు. తుఫాన్ లాంటి బ్యాట‌ర్ తో మంచి నీళ్లు మోయిస్తావా ? అంటూ గంభీర్ పై మ‌నీష్ ఓజా సీరియ‌స్ అయ్యారు. వైభ‌వ్ ను స‌రిగ్గా వాడుకుంటే సునామీ సృష్టిస్తాడని స్ప‌ష్టం చేశారు. కానీ అలా చేయ‌కుండా, రిజర్వ్ బెంచ్ పైన కూర్చోబెడ‌తావా ? అంటూ నిల‌దీశారు. ఇక‌నైనా వైభ‌వ్ కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. దీంతో వైభ‌వ్ చిన్ననాటి కోచ్ మ‌నీష్ ఓజా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Advertisement

వైభవ్ సూర్య వంశీ ఒక తుఫాను లాంటివాడు… అలాంటి వాడిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని గౌతమ్ గంభీర్ పై మనీష్ ఓజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని లైట్ తీసుకుంటున్న గౌతమ్ గంభీర్ కు సరైన ఎదురుదెబ్బ త్వరలోనే తగులుతుందని హెచ్చరించారు. రిజర్వ్ బెంచ్ పై కూర్చోబెట్టడం ద్వారా ప్లేయర్లను తయారు చేయవచ్చని గౌతమ్ గంభీర్ గాల్లో మేడలు కడుతున్నాడని మండిపడ్డారు. కానీ అలాంటి ఆలోచన మానుకుంటే బెటర్ అంటూ చురకలు అంటించారు. దిగ్గజ క్రికెటర్లతో ఇలాంటి వైభవ్ సూర్య వంశీ లాంటి వాళ్లను ఆడించాలని… అప్పుడే అనుభవం పెరుగుతుందని పేర్కొన్నారు.

వాట‌ర్ బాయ్ గా వాడతారా ? గంభీర్ పై సీరియ‌స్‌

అలా కాకుండా వాటర్ బాయ్ గా వాడుకుంటే మాత్రం వైభవ్ సూర్య వంశీ కెరీర్ నాశనం అవుతుందని వైభ‌వ్ సూర్య‌వంశీ చిన్న‌నాటి కోచ్ మ‌నీష్ ఓజా స్పష్టం చేశారు. భవిష్యత్తు టీమిండియాను తయారు చేసే క్రమంలో.. యంగ్ క్రికెటర్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని సూచనలు చేశారు. అప్పుడే ఈ కుర్ర క్రికెటర్లు పక్వానికి వస్తారని తెలిపారు. ప్రతిభ ఉన్న ఆటగాడిని ఎక్కువగా వాడుకుంటే అతడి లోపాలను కూడా అధిగమిస్తాడని స్పష్టం చేశారు. వైభవ్ సూర్య వంశీకి కావాలనే అవకాశాలు ఇవ్వకుండా కుట్రలు జరుగుతున్నాయని బాంబు పేల్చారు. అవకాశాలు ఇవ్వకుండా అతడిని టార్చర్ పెట్టే ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయని బాంబు పేల్చారు. దీని వల్ల వాళ్లకే నష్టం జరుగుతుందని.. కచ్చితంగా వైభవ్ ఉన్నత శ్రేణికి చేరుకొని వాళ్ళ అంతు చూస్తాడని కూడా హెచ్చరించారు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

మీకు అభిషేక్ ఉంటే, మాకు మాజ్ సదాకత్.. ఇక చూసుకుందాం రండి

ఎమ‌ర్జెన్సీ పాల‌న‌…పాకిస్తాన్, శ్రీలంక టీ20 సిరీస్ పై నీలినీడ‌లు

ఇక‌పై టీమిండియా చాలా జాగ్ర‌త్తగా ఉండాలి..నా నుంచి దేవుడు కూడా కాపాడ‌లేడు

మ్యాచ్ మ‌ధ్య బిర్యానీ తిన్న ష‌మీ…బండ‌బూతులు తిట్టిన ర‌విశాస్త్రి!

బౌలర్‌గా సచిన్ కొడుకు పనికేరాడు…అన్ని మూసుకుని ఆ పని చేయాలి

ఒరేయ్ పంజాబీ అంటూ విరాట్ కోహ్లీ నన్ను అవమానించాడు

2027 వరల్డ్ కప్‌లో టీమిండియా, పాక్ మధ్య ఫైనల్స్ జరిగేలా ఐసీసీ కుట్రలు

Big Stories

Advertisement
×