Sanju samson Six Controversy : టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన ఏకైక మ్యాచ్ లో అన్ని వివాదాలే చోటు చేసుకున్నాయి. ఇప్పటికే బాపూ అక్షర్ పటేల్ వైడ్ వివాదం హాట్ టాపిక్ కాగా, తాజాగా మరో రెండు కాంట్రవర్సీలు తెరపైకి వచ్చాయి. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ తప్పిదం చేసిన అంపైర్, ఫీల్డింగ్ సమయంలో రనౌట్ ఇవ్వలేదు. సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో 7 బంతుల్లో 9 పరుగులు చేశారు. ఇందులో ఒక బౌండరీ కూడా ఉంది. కానీ సంజు కొట్టింది సిక్సర్ అయితే, నిద్రపోయిన అంపైర్..బౌండరీ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అటు టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, జపాన్ ఆటగాడు రనౌట్ అయితే, అంపైర్ ఇవ్వలేదు.
టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో అంపైర్ మరో తప్పిదం చేశాడు. చివరి ఓవర్ లో బాపూ అక్షర్ పటేల్ వేసిన ఓ బంతిని జపాన్ ఆటగాడు అలెగ్జాండర్ షిరాయ్-పాట్‌మోర్ రివర్స్ స్వీప్ ఆడాడు. దీంతో వైడ్ గా ప్రకటించిన అంపైర్, ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బాపూ అక్షర్ పటేల్ తిరగబడటంతో, రిప్లై చూశాడు అంపైర్. ఇక ఐసీసీ రూల్స్ ప్రకారం, ఆ బంతిని కౌంట్ గా ప్రకటించారు. ఈ క్రమంలో టీమిండియా విజయం సాధించింది. కేవలం 2 పరుగుల తేడాతో కష్టపడి టీమిండియా, విక్టరీ అందుకుంది. దీనిపై పాకిస్తాన్ మాజీలే సీరియస్ అవుతున్నారు. అంపైర్లను బెదిరించి, టీమిండియా గెలిచిందని కామెంట్స్ చేస్తున్నారు.
జపాన్ పై 2 పరుగులతో విజయం సాధించిన టీమిండియాపై తన్వీర్ అహ్మద్ విషం కక్కారు. అంపైర్లను బెదిరించి, జపాన్ లాంటి పసికూన గొంతు కొశారని సీరియస్ అయ్యారు. తన లెక్క ప్రకారం టీమిండియా విజయం సాధించినట్టేనని వెల్లడించారు. చివరి ఓవర్ లో అది వైడ్ అయినప్పటికీ, దౌర్జన్యం చేసి అంపైర్ తో నిర్ణయాన్ని మార్పించేశారని సీరియస్ అయ్యారు. దీనిపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఐసీసీ పెద్దలకు లేఖ రాసి, టీమిండియా అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి, 5 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా… 32 పరుగులే చేసింది. ఈ టార్గెట్ ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది జపాన్. దీంతో 2 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా, టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.