BigTV English

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

 


BCCI:  టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోహిత్ కోహ్లీ వీరిద్దరూ తమదైన ఆట తీరుతో టీమిండియా కు ఎన్నో విజయాలను అందించారు వారి ఆట తీర్పు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే కాగా వీరిద్దరూ గత కొద్ది రోజుల క్రితమే టెస్టులు t20 లకు రిటైర్మెంట్ ప్రకటించారు కేవలం వన్డే మ్యాచ్లు మాత్రమే చేశారు. కాగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లకు బీసీ సీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. 2027 ODI WC ప్లాన్ నుంచి వీరిద్దరిని తప్పించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also Read: Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో


ఒకవేళ వీరు WC ఆడాలనుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలని రూల్ విధిస్తున్నట్లుగా సమాచారం. వీరి స్థానంలో వేరే కుర్రాళ్లను ప్రోత్సహించాలి అని బీసీసీఐ భావిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి కాగా కోహ్లీ రోహిత్ శర్మ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కూడా టెస్టులు t20 లకు రిటైర్మెంట్ తీసుకొని కేవలం వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాలని నిర్ణయం తీసుకున్నారు. వన్డే వరల్డ్ కప్ 2027 సంవత్సరంలో జరగనుంది. అప్పటివరకు వీరిద్దరూ ఆ టోర్నమెంట్ లో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ టోర్నమెంట్ లో కోహ్లీ, రోహిత్ ను సెలెక్ట్ చేయకూడదని బీసిసిఐ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగినట్లయితే ఆ లోపే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.  ఈ విషయం తెలిసిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు.

గంభీర్ కుట్రలేనా ?

కోహ్లీ అలాగే విరాట్ కోహ్లీ కి 40 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయని… కాబట్టి వాళ్ళిద్దరిని జట్టులోంచి తొలగించాలని గౌతమ్ గంభీర్ సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ కూడా కొత్త కుర్రాళ్లకు అప్పగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి.. సూచనలు చేస్తున్నారట ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.

Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో సెటిల్ అయిపోయారు. మ్యాచ్లు ఉన్న సమయంలోనే వచ్చి తన ఆటను ముగించుకొని తిరిగి మళ్ళీ లండన్ వెళ్లిపోతున్నారు. తన భార్య, కూతురు, కుమారుడితో కలిసి సంతోషంగా లండన్ లో గడుపుతున్నారు. విరాట్ కోహ్లీ తరహాలోని రోహిత్ శర్మ కూడా లండన్ లో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లి ఉండాలని అనుకుంటున్నారట. వీరిద్దరూ కలిసి లండన్ లో చాలా హ్యాపీగా ఎలాంటి హంగామా లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

 

 

Related News

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Big Stories

×