E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన దీప, కార్తీక్           

Karthika Deepam 2 Serial Today Episode September 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన దీప, కార్తీక్           
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  దీప, కార్తీక ఇంటికి వచ్చాక జ్యోత్స్నకు కొత్త బట్టలు ఇస్తారు. దీంతో జ్యోత్స్న వీటికి కూడా తర్వాత డబ్బులు ఇస్తానని చెప్తుంది. ఈ కష్టకాలంలో కూడా మీరు ఫ్యామిలీ కోసం పోరాడుతున్నారు. కానీ మీ మీద ఎవ్వరికీ నమ్మకం లేదు అందరూ మిమ్మల్నే దోషులుగా చూస్తున్నారు మీరు తప్పు చేయలేదన్న విషయం నాకు తెలుసు.. నేను మీకు సపోర్టు చేయోచ్చు కానీ చేయను ఎందుకంటే నేను మీకు సపోర్టుగా మాట్లాడితే తాతయ్య కోప్పడతాడు. నన్ను కూడా మీరు మార్చేశారని నిందిస్తాడు.  అలా అని మిమ్మల్ని వ్యతిరేకించలేను నేను దశరథ, సుమిత్రల కూతురిగానే ఉండిపోతాను ఏం జరిగినా నేను వాళ్ల వైపే నిలబడతాను అని చెప్తుంది జ్యోత్స్న.

మీరు పెట్టిన తిండికి ఇచ్చిన షెల్టర్‌కు బట్టలకు అన్నింటికీ గ్రానీ లెక్కలు రాస్తుంది అంటూ జ్యోత్స్న చెబితే.. కార్తీక్‌ డబ్బులు అవసరం లేదని తన కుటుంబం కోసమే తాము నిలబడ్డామని చెప్తాడు. మనం ఒక్కమాట మీద ఉంటే ఈ కష్టాలు తీరడం ఓ లెక్కా అంటుంది దీప. అప్పుడే దశరథ వచ్చి వద్దని కలిసుందాం అనే మాట అనకండి జ్యోత్స్న నువ్వు లోపలికి వెళ్లు కొందరికి అలవాటు పడకపోవడమే మంచిది. మనం ఇక్కడ శరణార్థులుగా ఉన్నాము ఏదో ఒక రోజు వెళ్లిపోవాలి ఇప్పుడు అలవాటు పడితే ఆరోజు బాధపడాల్సి వస్తుంది అంటూ చెప్పగానే.. జ్యోత్న్స లోపలికి వెళ్తుంది. దీప బాధపడుతుంది. నాన్న మీరేనా ఇలా మాట్లాడేది. కోపం ఉంటే కొట్టండి.. తిట్టండి అంతే కానీ ఇలా బాధపెట్టకండి నాన్న అంటుంది. అందుకు దశరథ వెటకారంగా నిన్ను కొట్టి తిట్టే అర్హత నాకు లేదమ్మా.. అసలు నువ్వు నాకు కూతురు అని తెలియకపోయి ఉంటే బాగుండేది.. మేం ఈ ఇంట్లో ఉన్నంత వరకు నా కూతురికి మీరు దూరంగా ఉండండి అంటాడు. దీంతో దీప ఏడుస్తుంది.

Advertisement

సుమిత్ర విషయంలో దక్షిణమూర్తిని కన్వీన్స్‌ చేసిన మాలిని జ్యోత్స్న రెస్టారెంట్స్‌ బాధ్యత తీసుకోమని సూరజ్‌కు చెప్తుంది. సూరజ్‌ తాను ఆ బాధ్యతలు తీసుకోలేనని చెప్తాడు. అయితే నువ్వు తప్పు చేశానని ఫీల్‌ అవుతున్నావు కాబట్టే ఆ బాధ్యతలు తీసుకోవా అని మాలిని ప్రశ్నిస్తే.. బలవంతంగా సూరజ్‌ను ఒప్పించొద్దని దక్షిణమూర్తి అంటాడు. అయితే సూరజ్‌ మాత్రం తాను ఇంతకు ముందు అక్కడ వర్క్‌ చేశానని ఇప్పుడు అక్కడ వెళ్లి మళ్లీ వర్క్‌ చేయడం నచ్చడం లేదని చెప్తాడు. అయితే నా కోసం ఈ బాధ్యతలు తీసుకో మీ అమ్మ కోసం ఈ కంపెనీ నిర్వహణ చూసుకో నాన్న అంటూ మాలిని అంటే సరే అమ్మ నీకోసం ఏమైనా చేస్తాను అంటాడు సూరజ్‌. నాకోసం చేస్తావు కానీ నీకోసం చేయవా..? అంటూ మాలిని ప్రశ్నిస్తే.. నీకోసమే చేస్తానమ్మా.. ఒకవేళ నా కోసం నేను చేయాల్సి వస్తే అది నువ్వు చూసి తట్టుకోలేవు అమ్మా అంటాడు సూరజ్‌.

తన ఫోన్‌లో ఉన్న సూరజ్‌ ఫోటో చూస్తున్న జ్యోత్స్నను వెనక నుంచి శివనారాయణ చూస్తాడు. కొన్ని జ్ఞాపకాలు వదిలేస్తే మంచిదమ్మా అన్ని డిలీట్‌ చేసేయ్‌ అంటాడు. అక్కడే ఉన్న శౌర్య అమాయకంగా శివనారాయణతో జ్యోకు సూరజ్‌కు ఎందుకు పెళ్లి జరగలేదు అని అడుగుతుంది. అప్పుడే వచ్చిన కార్తీక్‌ అది బొమ్మల పెళ్లి అంటూ శౌర్యను అక్కడి నుంచి పంపిచేస్తాడు. దీపతో తమ నాటకం మొదలుపెట్టాలని చెప్తాడు.

Advertisement

మాలిని, సూరజ్‌ను జ్యోత్స్న రెస్టారెంట్స్‌ ఆఫీసుకు తీసుకెళ్లి కొత్త చైర్మన్‌గా పరిచయం చేస్తుంది. అందరూ బోర్డు మెంబర్స్‌ ఉంటారు. వారిలో ఒకరు మరి కొత్త సీఈవో ఎవరని అడిగితే.. అప్పుడే దీప, కార్తీక్‌ ఎంట్రీ ఇస్తారు. సీఈవో వచ్చారు అని కార్తీక్‌ చెబితే.. మాలిని తిడుతుంది. మీరెందుకు వచ్చారని అడుగుతుంది. అందుకు కార్తీక్‌ సీఈవో దీప ఇక్కడకు రాకపోతే ఎక్కడకు వెళ్తుంది అని చెప్పగానే.. మాలిని దీప ఏంటి సీఈవో బయటకు వెళ్లిపోండి అంటుంది. అప్పుడు దీప సీఈవో అయినప్పుడు రాసిన అగ్రిమెంట్‌ మీద సూరజ్‌ సంతకం చేసిన విషయం చెప్పి అగ్రిమెంట్‌ చూపిస్తాడు. ఆ అగ్రిమెంట్‌ చూసి మాలిని షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. పార్వతి మాటతో షాక్.. పాపం ప్రభా..

Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన చక్రీ.. అడ్డంగా బుక్కయిన మాధవ్.. మహా దెబ్బకు మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 23rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మలోని అరుంధతి   

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో షాక్.. శ్రీవల్లికి మరో దెబ్బ.. సుకన్య ప్లాన్ సక్సెస్..

Ninnu kori Serial Today Episode September 23rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను చీట్ చేసి ఆస్థి కొట్టేయాలనుకున్న జీవన్ 

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవి దొరికిపోతుందా..?

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Big Stories

Advertisement
×