Wahab Riaz on Fatima Sana: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి నాలుగు మ్యాచ్ లలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్, చివరి మ్యాచ్ లో మాత్రం గెలిచింది. అయితే వరుసగా నాలుగింటిలో గెలిచిన పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మా వాళ్లకు వంటింట్లో కూరలు చేయడం తప్ప… క్రికెట్ ఆడటం చేతకాదంటూ షాహిద్ అఫ్రిది ( Shahid afridi) లాంటి చాలా మంది మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో (ICC Women’s T20 World Cup 2026 Tournament ) పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సందర్భంగా ఆ జట్టు కోచ్ వహాబ్ రియాజ్ (Wahab Riaz) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా ఖండంలోనే పాకిస్తాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima Sana) తోపు క్రికెటర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆసియా ఖండంలో ఆమెను ఐరన్ లేడీగా గుర్తించవచ్చని… దానికి సంబంధించిన అవార్డు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీమిండియాలో కూడా ఫాతిమా సనా లాంటి క్రికెటర్లు ఎవరు లేరని.. ఆమెను దాటే ప్రసక్తి లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే దురదృష్టవశాత్తు టోర్నమెంట్ మాత్రం ఓడిపోయామని ఎమోషనల్ అయ్యారు కోచ్ రియాజ్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా అద్భుతంగా పోరాడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ అదే సమయంలో బౌలింగ్ రెండు విభాగాల్లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేస్తూ ముందుకు దూసుకు వెళ్ళింది ఫాతిమా సనా. అయితే ఆమె ఒంటరి పోరాటం చేసినప్పటికీ పాకిస్తాన్ మాత్రం చిత్తుగా ఓడిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా కోచ్ వహాబ్ రియాజ్ పేర్కొన్నారు. అందరిలాగా ఫాతిమా సనా కాదని… పాకిస్తాన్ కోసం ప్రాణాలు కూడా ఇస్తుందంటూ వ్యాఖ్యానించారు. అలాంటి క్రికెటర్ ను కలిగి ఉండడం పాకిస్తాన్ చేసుకున్న అదృష్టమని ప్రశంసల వర్షం కురిపించారు. అలియ రియాజ్ తరహాలో ఇంగ్లాండులో చెక్కర్లు కొట్టలేదని… జట్టు కోసం చాలా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. దీంతో కోచ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.