BRS MLCs: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ‘పెద్దల సభ’ (శాసనమండలి) కే పరిమితమైన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పుడు తమ రూటు మార్చుతున్నారు. మండలిలో కూర్చొని చట్టాలు చేయడం కంటే క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ అసెంబ్లీ (శాసనసభ) కి వెళ్లడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచి తమ సత్తా చాటాలని, ‘ఎమ్మెల్యే’ ముద్ర వేయించుకోవాలని పలువురు ఎమ్మెల్సీలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని పలు కీలక నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే రాజకీయ వేడి రాజుకుంది.
సాధారణంగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, టికెట్ రేసులో ముందంజలో ఉండాలని ఆశిస్తున్న ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లో పర్యటనలు ముమ్మరం చేశారు. తమకు పట్టణ లేదా సమీకరణలు అనుకూలంగా ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్సీలు అప్పుడే రంగంలోకి దిగారు. జనాల్లోనే ఉంటున్నారు: స్థానిక శుభకార్యాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ పిలుపునిచ్చే నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. క్యాడర్ బలోపేతం: నియోజకవర్గాల్లో తమకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని, బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తిన వెనుక గ్రూపు రాజకీయాలు తమకంటూ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
సమస్యలపై ఫోకస్: స్థానిక సమస్యలపై స్పందిస్తూ, ప్రజలకు తాము నిరంతరం అందుబాటులో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు. తెరవెనక గ్రూపు రాజకీయాలను చక్కదిద్దుతుంది కంటూ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకునే పనులు నిమగ్నమయ్యారు. అధిష్టానని ప్రసంగం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారు కేవలం క్షేత్రస్థాయిలోనే కాదు పార్టీ అధిష్టానం వద్ద మార్పులు కొట్టేసేందుకు ఎమ్మెల్సీలు రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. శాసనసభలో పార్టీ వానిని బలంగా వినిపించడంతోపాటు పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ లీడర్షిప్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Also Read: ఇంట్లోనే థియేటర్ వైబ్స్ బ్రో! రూ.5,999కే మీ స్మార్ట్ టీవీకి పర్ఫెక్ట్ జోడి
శాసనమండలి సభ్యుడిగా ఉండటం కంటే, శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) ఎన్నికైతేనే నియోజకవర్గంలో పట్టు సాధించవచ్చని, నిధుల కేటాయింపులు, అధికార పరంగా మరింత పట్టు దొరుకుతుందనేది వీరి భావన. అందుకే ‘సభ’ వైపు వెళ్లేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
టికెట్ దక్కించుకోవాలంటే కేవలం క్షేత్రస్థాయి పట్టు ఉంటే సరిపోదు, అధిష్టానం ఆశీస్సులు కూడా అంతే ముఖ్యం. ఇందుకోసం సదరు ఎమ్మెల్సీలు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో పడేందుకు, అధిష్టానం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేస్తున్నారు. తమకు కేటాయించిన జిల్లాల బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూనే తాము ఆశిస్తున్న అసెంబ్లీ సీటు పరిధిలోని పార్టీ గ్రాఫ్ పెంచేలా సర్వే రిపోర్ట్ లు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అవసరం అయితే పార్టీ ఫండ్ కార్యక్రమాల నిర్వహణకు భారీగా ఖర్చు పెట్టేది కూడా వెనుకడం లేదని సమాచారం. సర్వేల్లో సానుకూలత కోసం: రాబోయే రోజుల్లో టికెట్ల కేటాయింపులో పార్టీలు అంతర్గత సర్వేలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో, గ్రాఫ్ పెంచుకునే పనిలో పడ్డారు.
Also read: హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. మిడ్‌నైట్ ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
లాబీయింగ్ షురూ: పార్టీలోని కీలక నేతలు, గాడ్ ఫాదర్ల ద్వారా తమకు సీటు కేటాయించేలా ఇప్పటి నుంచే ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక బలంను సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న స్థానాలు పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆర్థిక అంగ బలం ప్రత్యక్ష ఎన్నికల్లో ఖర్చుకు వెనకాల భూమన సంకేతాలు అధిష్టానానికి ఇస్తున్నారు. సొంత క్యాడర్ నిర్మాణం ప్రస్తుత ఇన్చార్జిలతో సంబంధం లేకుండా సొంతంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం అనే ప్రత్యేక దృష్టి సాధించారు.
ఎమ్మెల్సీల ఈ వ్యూహాత్మక అడుగులు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు మింగుడుపడటం లేదు. తటస్థంగా ఉండాల్సిన పెద్దల సభ సభ్యులు, తమ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని సిట్టింగ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇది ‘సిట్టింగ్ వర్సెస్ ఎమ్మెల్సీ’గా మారి తీవ్ర అంతర్గత విభేదాలకు దారితీస్తోంది. మా సీటుకే ఎసరు పెడుతున్నారా అంటూ సొంత పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు మొదలైందని సమాచారం అధిష్టానం మాత్రం యాక్టివిటీని గుర్తిస్తూ సర్వేలో ఎవరికి ఆదరణ ఉంటే వారికి ఆ సీటు అనే సంకేతాలు ఎమ్మెల్సీలు తమ వేగాన్ని మరింత పెంచారు.
ఏది ఏమైనా, రాబోయే ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా శాసనసభ గడప తొక్కాలనే పట్టుదలతో ఉన్న ‘పెద్దలు’.. అటు అధిష్టానాన్ని, ఇటు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. టికెట్ వేటలో ఇప్పటినుంచే వేగం పెంచిన వీరు.. మున్ముందు ఏ మేరకు సఫలీకృతం అవుతారో చూడాలి.
Also read: కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి.. బాహుబలి పార్ట్ 2 చూస్తానో లేనో అంటూ!
బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఇప్పటికే పలు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. ఆయా వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు సొంతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో దృష్టి సారించారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు రాజు శేర్లింగంపల్లి నియోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు స్పీడ్ పెంచారు. మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ షాద్నగర్ నియోజకవర్గం పై దృష్టి సారించారు. ఖమ్మం జిల్లా చెందిన ఎమ్మెల్సీ తాతా మధు పాలేరు నియోజకవర్గం పై దృష్టి సారించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుపాలకుర్తి నియోజకవర్గం ఈమెయిల్ ఏ టికెట్ ఆశిస్తున్నారు.
మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గ టికెట్పై ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ తనకే దక్కాలని ఇప్పటినుండి యాక్టివిటీ ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా ఆయన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బి ఆర్ ఎస్ అధిష్టానం నిత్యం ప్రజల్లో ఉండే నేతలకే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ప్రకటించడంతో నేతలు యాక్టివిటీ ముమ్మరం చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనేది చూడాలి.
Also Read: ఎట్టకేలకు శాంసంగ్ లవర్స్ కల నెరవేరింది.. క్రేజీ కెమెరా, భారీ బ్యాటరీతో వస్తోన్న Galaxy S27 Ultra!