MS Dhoni: ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో 5 టి-20లో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ తో 3 వన్డేలు ఆడనుంది భారత జట్టు. ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి కళ్ళు ఈ సిరీస్ పైనే ఉన్నాయి. అయితే ఈ సిరీస్ పూర్తయిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరగనుంది. ఈ సీజన్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇది చివరి ఐపీఎల్ సీజన్ అనే ప్రచారం జరుగుతుంది.
Also Read: Yuzvendra Chahal: అర్థరాత్రి 12 గంటలకు ఆ మిస్టరీ లేడీతో చాహల్ వీడియో కాల్స్ !
ఇలాంటి పరిస్థితులలో ధోని ఈ ఐపీఎల్ లో తన అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. 2019 వ సంవత్సరం జూలై నుండి అంతర్జాతీయ క్రికెట్ కి దూరంగా ఉన్న ధోని.. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించి దాదాపు 5 సంవత్సరాలు. అయితే ధోనీ కోసం బీసీసీఐ ఓ రూల్ ని మళ్లీ తీసుకువచ్చింది. ఐపీఎల్ 2025 లో రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్లలో అన్ క్యాప్డ్ ప్లేయర్ ఉండాలని కండిషన్ ని ప్రవేశపెట్టింది బీసీసీఐ.
గరిష్టంగా ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రకారం ధోని అన్ క్యాప్డ్ ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2025 లో బరిలోకి దిగబోతున్నాడు. అన్ క్యాప్డ్ ప్లేయర్స్ రిటెన్షన్ ఫీజు రూ. 4 కోట్లు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2025 కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టాడు ధోని. ఇటీవల ధోని నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కి ముందు తాజాగా ఈ కెప్టెన్ కూల్ ఓ ఆలయంలో పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాంచీలోని డియోరీ మాత ఆలయాన్ని ధోని సందర్శించారు. 8 చేతులతో ఈ ఆలయంలో పూజలు అందుకునే దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన ధోని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ధోని ఐపీఎల్ 2025 సీజన్ కోసమే ప్రత్యేక పూజలు నిర్వహించాడని, బ్యాట్లకు కూడా పూజలు చేయించాడని పలు కథనాలు వెలువడుతున్నాయి.
Also Read: Virender Sehwag Divorce: షాకింగ్.. విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్.?
ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ధోని నేతృత్వంలో ఆరోసారి కప్ కొట్టడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ధోని తన ఐపిఎల్ కెరీర్ లో 264 మ్యాచ్ లలో 5,243 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతే కాదు తన కెప్టెన్సీలో ఐదు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్ కప్ ని అందించాడు.
MS Dhoni at Deori Maa temple. 🙏❤️ pic.twitter.com/aRS7kGRznO
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2025