BigTV English

AB De villiers : AB డివిలియర్స్ రీ ఎంట్రీ.. 360 డిగ్రీ బ్యాట్ తోనే

AB De villiers : AB డివిలియర్స్ రీ ఎంట్రీ.. 360 డిగ్రీ బ్యాట్ తోనే

AB De villiers : మిస్టర్ 360, సౌతాఫ్రికా ఐకాన్ ఏబీ డివిలియర్స్(ABD) దాదాపు నాలుగేళ్ల తరువాత క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా డివిలియర్స్ ప్రకటించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రీ ఎంట్రీలో డివిలియర్స్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ లో ఆడనున్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్స్ సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ కి ఈ మాజీ సఫారి విధ్వంసకర ఆటగాడు కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ  టీ-20 ఫార్మాట్ లో జరుగబోయే ఈ టోర్నీని క్రికెట్  (Cricket) నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు ఆడతారు.


Also Read :  Ind vs eng test series: సుందర్, కరుణ్, నితీష్ లను ఇండియాకు పంపించిన బీసీసీఐ.. స్పెషల్ ఫ్లైట్ వేసి మరీ

ABD కెప్టెన్సీ.. 


మరోవైపు డివిలియర్స్ తమ జట్టులో చేరడం పట్ల  గేమ్ ఛేంజర్స్ కో ఓనర్ హ్యారీ సింగ్ సంతోషం వ్యక్తం చేసాడు. డివిలియర్స్ కెప్టెన్సీ మా జట్టును మరో మెట్టులో నిలబెడుతుందని తెలిపారు. అతను కేవలం ఆటగాడు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తిని ఇచ్చిన ఒక ఐకాన్. మా జట్టుకు నాయకత్వం వహించాలనే అతని నిర్ణయం మా అదృస్టం అని  చెప్పాడు. ప్రారంభ సీజన్ లో జాక్వెస్ కల్లీస్, హెర్షెల్ గిబ్స్, డేల్ స్టేయిన్, ఇమ్రాన్ తాహిర్ వంటి దిగ్గజాలు ఉన్న గేమ్ ఛేంజర్స్ స్క్వాడ్ లో ఇప్పుడు డివిలియర్స్ చేరడంతో ఆ జట్టు మరింత పటిష్టంగా మారనుంది. వాస్తవానికి డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కెరీర్ లో టాప్ లో ఉన్న ఈ సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ 34 సంవత్సరాలకే క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. డివిలియర్స్ మే 2018లో అంతర్జాతయ క్రికెట్ కి గుడ్ చెప్పినా.. ఆ తరువాత రెండేళ్లు తన క్రికెట్ కెరీర్ కొనసాగించారు.

ఏబీడీ ఎంట్రీ అప్పుడే.. 

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) , బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ ఆఢాడు. 2021 క్రికెట్ లో అన్ని రకాల క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. 2018 ఫిబ్రవరిలో సౌతాఫ్రికా తరపున చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు డివిలియర్స్. అదే సంవత్సరం ఏప్రిల్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ప్రొటీస్ జట్టుకి చివరి సారి ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్ లో డివిలియర్స్ 5వేలకు పైగా పరుగులు చేయడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్  విషయానికి వస్తే.. ఏబీ డివిలియర్స్ సౌతాఫ్రికా తరున 2004లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  తన కెరీర్ లో 114 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన డివిలీయర్స్ 8,765 పరుగులు చేశాడు. వన్డేలలో 228 మ్యాచ్ లు ఆడి.. 9,577 పరుగులు చేసాడు. ఇక టీ-20లలో 78 మ్యాచ్ లు ఆడి.. 1,672 పరుగులు చేశాడు. కుటుంబంతోో కలిసి సమయం గడిపేందుకు 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. మళ్లీ టీ-20 టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భారత్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) కెప్టెన్సీలో ఆడనుంది.తొలి సీజన్ లో భారత్ పాకిస్తాన్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది.

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×