E-Paper
Advertisement

Ms Dhoni: ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకు ఉండ‌దు?

Ms Dhoni: ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకు ఉండ‌దు?
Advertisement

Ms Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని, మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. టి20 వరల్డ్ కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించి రిటైర్మెంట్ ఇచ్చాడు. దాదాపు పది సంవత్సరాల పాటు టీం ఇండియాను అత్యంత బలమైన జట్టుగా తయారుచేసిన హీరోగా మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని నిలిచాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ధోని ఉన్నన్ని రోజులు తన హెల్మెట్ పై జాతీయ జెండాను పెట్టుకోలేదని ఫైర్ అవుతున్నారు. అత‌డికి జాతీయ భావం లేద‌ని ఫైర్ అవుతున్నారు.

ధోని హెల్మెట్ పై జాతీయ జెండా లేక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు

టీమ్ ఇండియా జట్టులో చాలా మంది క్రికెటర్లు తమ హెల్మెట్లపై జాతీయ జెండాలను ముద్రించుకుంటారు. వికెట్ కీపర్లు రిషబ్ పంత్, కే ఎల్ రాహుల్ లాంటి వాళ్లు కూడా వికెట్ల వెనకాల నిలబడి… జాతీయ జెండా ఉన్న హెల్మెట్లను వాడుతారు. కానీ టీమిండియా కు మూడు ఐసీసీ ట్రోఫీలు తీసుకువచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం.. తన హెల్మెట్ పై జాతీయ జెండాను పెట్టుకోలేదు. దీనిపై ఇప్పుడు కొంతమంది ధోని అంటే పడని వారు విమర్శలు చేస్తున్నారు. ఇండియా అంటే అతనికి గౌరవం లేదని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ప్ర‌తీ ఇండియ‌న్ క్రికెట‌ర్, జాతీయ జెండాను హెల్మెట్స్ పై వేసుకోవాల్సిందే అంటున్నారు.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకు ఉండ‌దు? అస‌లు కార‌ణం ఏంటి

మహేంద్ర సింగ్ ధోని తన హెల్మెట్ పై జాతీయ జెండా కాకుండా కేవలం బీసీసీఐ లోగో మాత్రమే పెట్టుకుంటాడు. మిగతా క్రికెటర్ల లాగా ధోని హెల్మెట్ పై జాతీయ జెండా ఎక్కడ కనిపించదు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. వికెట్ కీపర్ స్పిన్నర్లు బౌలింగ్ చేసినప్పుడు కచ్చితంగా హెల్మెట్ వాడాలి. ఆ తర్వాత అదే హెల్మెట్ ను నేలపైన పెట్టి, సాధారణ క్యాబ్ ధరించాలి.

Advertisement

అయితే జాతీయ జెండా ఉన్న హెల్మెట్ నేలపై పెట్టకూడదని.. అది ఇండియాకు అవమానమని భావించాడట ధోని. అందుకే బిసిసిఐ పర్మిషన్ తో జాతీయ జెండా లేకుండా ఉన్న హెల్మెట్ కు మాత్రమే వాడుతున్నాడు. ఈ విషయం తెలియక కొంతమంది ధోని హేటర్స్ అతడిని విమర్శలు చేస్తున్నారు. అయితే మహేంద్ర సింగ్ ధోని అభిమానులు మాత్రం విమర్శలు చేసే వాళ్లకు కౌంటర్ ఇస్తున్నారు. ఇండియాలో ఏ క్రికెటర్ కు కూడా ధోని కి ఉన్నంత దేశభక్తి ఎవరికి లేదని అంటున్నారు. ధోని ఆర్మీ వ్యవస్థలో కూడా పనిచేసే ఎన్నో రికార్డులు సృష్టించాడని గుర్తు చేస్తున్నారు.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×