BigTV English

T Natarajan: రూ. 10.75 కోట్లు పెట్టి…నటరాజన్‌ ను ఆడించకపోవడంపై క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ

T Natarajan: రూ. 10.75 కోట్లు పెట్టి…నటరాజన్‌ ను ఆడించకపోవడంపై క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ

T Natarajan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament) ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో చాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొట్టమొదటిసారిగా టైటిల్ గెల్చుకుంది. ఫైనల్ మ్యాచ్ మొన్న మంగళవారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  ( Punjab Kings vs Royal Challengers Bangalore ) మధ్య జరగగా… చివరికి విజయం మాత్రం బెంగళూరు ను వరించింది. ఈ నేపథ్యంలోనే ఆరు పరుగులు తేడాతో విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.


Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్

నటరాజన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals Team)కీలక ప్రకటన


ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో బెంగళూరు ఛాంపియన్ గా నిల్వగా… అందరినీ ఒక ప్రశ్న వేధిస్తోంది. 10.75 కోట్ల రూపాయలు పెట్టి మరి హైదరాబాద్ జట్టుకు సంబంధించిన నటరాజను ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు కొనుగోలు చేసింది? కొనుగోలు చేసిన ఢిల్లీ….అతన్ని… ఎందుకు ఆడించలేదు ? అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో టోర్నమెంట్ పూర్తయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమంగ్ బదానీ క్లారిటీ ఇచ్చారు.

మెగా వేలంలో 10.75 కోట్ల రూపాయలకు నటరాజను కొనుగోలు చేసి ఒకట్రెండు మ్యాచ్లకే పరిమితం చేయడంపై వివరించారు బదానీ. నటరాజన్ ను తాము తప్పించలేదని.. ఫిట్ గా లేకపోవడం కారణంగా అతడు ఆడలేక పోయాడని వివరించారు. ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని క్లారిటీ ఇచ్చారు. నటరాజన్ ను మిడిల్ అలాగే డెత్ ఓవర్ల కోసం తీసుకున్నట్లు గుర్తు చేశారు. అయితే గాయం నుంచి కోలుకోవడంలో నటరాజన్ …. ఈ సీజన్ అంత చాలా ఇబ్బంది పడ్డాడని స్పష్టం చేశారు. అందుకే ఒకటి రెండు మ్యాచ్లకు మాత్రమే నటరాజన్ ను పరిమితం చేసినట్లు వెల్లడించారు.

Also Read: Vijay Mallya: తీసుకున్న రుణాలు కట్టిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్.. ‘ఊ లా లాలా లే ఓ’ జింగిల్ సీక్రెట్ ఇదే!

ప్లే ఆప్స్ ఆశలను చేజేతులా పోగొట్టుకున్న ఢిల్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో  ( Indian Premier League 2025 Tournament) ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బ్రహ్మాండంగా ఆడింది. కానీ ప్లే ఆఫ్ దశ వచ్చేసరికి… ఢిల్లీ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో 14 మ్యాచ్లు ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇందులో సగానికంటే ఎక్కువ అంటే ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆరు మ్యాచ్లలో ఓడిపోయింది. ఒకే ఒక్క మ్యాచ్ ఫలితం లేకుండా… ముగిసింది. అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ కావడం విశేషం. అయితే ఈ టోర్నమెంట్లో 15 పాయింట్లు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్…. టోర్నమెంట్ నుంచి వైదొలిగింది.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×