అలాంటి లెజండరీ క్రికెటర్లలో ఒకడిగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. తనకి ఫ్రాంచైజీ నుంచి ఏడాదికి రూ.12 కోట్లు అందుతున్నాయి. అయితే, 2024 సీజన్ లో ధోనీ సాధారణ వికెట్ కీపర్ గా ఆడాడు.
ఇప్పుడు చెన్నయ్ సూపర్ కింగ్స్ కి సంకట స్థితి ఎదురైంది. అదేమిటంటే ధోనీ చేసేది వికెట్ కీపింగ్ మాత్రమే. తనెంత కాలం ఆడతాడో తెలీదు. మహా అయితే మరో ఏడాది మాత్రమే ఆడే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనని అట్టే పెట్టుకుని రూ.12 కోట్లు చెల్లించే పరిస్థితి లేదు. అందుకు ధోనీ కూడా అంగీకరించడం లేదు.
ఇదిలా ఉండగా మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగు జరిగింది. ఇందులో చెన్నై ఒక ప్రతిపాదన చేసింది. అదేమిటంటే అన్ క్యాప్డ్ రూల్ మళ్లీ తీసుకురావాలని కోరింది. దీనివల్ల ధోనిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆడించే అవకాశాలున్నాయి. అప్పుడు తనకి రూ.4 కోట్లు మాత్రమే ఇవ్వవచ్చు. అలా జట్టుకి భారం ఉండదు.
ప్రస్తుతం చెన్నయ్ సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ హీరో ధోనీ కోసం ఈ రూల్ తీసుకురమ్మని కోరింది. దీనిపై బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే ధోనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను మ్యాచ్ లు ఆడుతుంటే చూసేందుకు జనం క్యూలు కడతారు. యాడ్స్ పెరుగుతాయి. ఐపీఎల్ కి ఒక కలరింగ్ ఉంటుంది. ఇన్నిలాభాలున్నాయి కాబట్టి ధోనీ కోసం రూల్స్ ను సవరించక తప్పదని బీసీసీఐ భావిస్తోంది.