E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న డీల్ కు ఓకే చెప్పిన సూరజ్   

Karthika Deepam 2 Serial Today Episode June 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న డీల్ కు ఓకే చెప్పిన సూరజ్   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: ఆఫీసులో దీప కళ్లు తిరుగుతున్నాయని కూర్చుంటే కార్తీక్‌ కంగారుగా సాల్ట్‌ వాటర్‌ తీసుకొచ్చి ఇస్తాడు. వాటర్‌ తాగాక కార్తీక్‌ దీపను ఇంటికి తీసుకెళ్తుంటే.. సూరజ్‌ మీరు కూడా దీపకు తోడుగా ఉండండి అంటూ చెప్పగానే..జ్యోత్స్న వచ్చి నాకు డ్రైవర్‌గా నువ్వుంటావా..? అని అడుగుతుంది. దీంతో కార్తీక్ కోపంగా డ్రైవర్‌ కూడా సిక్‌ లీవ్‌ తీసుకోవచ్చు అంటూ కారు కీస్‌ జ్యోత్స్న చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. జ్యోత్స్న కోపంగా చూస్తుంటుంది.

తర్వాత సూరజ్‌ పని చేసుకుంటుంటే.. జ్యోత్స్న సూరజ్‌నే చూస్తూ ఉంటుంది. దీంతో సూరజ్‌ నన్ను చూస్తే ఆకలి తీరదు.. ఏదైనా తింటే ఆకలి తీరుతుంది అని చెప్పగానే.. నా ఫుడ్‌ నాకు వస్తుందిలే అంటూ జ్యోత్స్న తిట్టబోతుంటే.. అప్పుడే శివనారాయణ వస్తాడు. ఆయనను చూసి కామ్‌ అయిపోతుంది. శివనారాయణ వచ్చి లంచ్‌కు వెళ్దామా అని అడగ్గానే.. సూరజ్‌ రెస్టారెంట్‌ నుంచి ఫుడ్‌ తెప్పించుకుని తిన్నానని చెప్తాడు. జ్యోత్స్న తాను ఫుడ్‌ వద్దానని చెప్తుంది. ఇంతలో ఆఫీస్‌ బాయ్‌ వచ్చి మీకు పిజ్జా వచ్చింది మేడం అంటూ ఇచ్చి వెళ్లిపోతాడు. ఎవరు చేశారు అర్డర్‌ అని జ్యోత్స్న ఆలోచిస్తూ.. గ్రానీ చేసిందేమో అనుకుంటూ అదే విషయం శివనారాయణకు చెప్తుంది.

Advertisement

దీంతో సూరజ్‌ ఆ పుడ్‌ ఆర్డర్‌ తానే చేశానని చెప్తాడు. మీరు బయటి ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తారేమోనని మన జ్యోత్స్న రెస్టారెంట్‌ నుంచే ఆర్డర్‌ చేశాను అని చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా నేను ఫుడ్‌ ఎక్కడ తినాలో కూడా నువ్వే డిసైడ్‌ చేస్తావా..? అంటుంది. దీంతో సూరజ్‌ మన ఫుడ్‌ మనం తింటేనే కదా..? ఆ ఫుడ్‌ ఎలా ఉందో తెలిసేది. అనగానే.. శివనారాయణ సూరజ్‌ను మెచ్చుకుంటాడు. ఇంతలో జ్యోత్స్న దీన్ని మరోలా ఎందుకు అనుకోకూడదు తాత ఎప్పుడూ మన ఫుడ్‌ మనం చూడటం కాదు.. బయటి ఫుడ్‌ కూడా ఎలా ఉందో తెలుసుకోవాలి కదా..? అనగానే.. శివనారాయణ నువ్వు చెప్పేది కూడా కరెక్ట్‌ అంటూ దీప, కార్తీక్‌ గురించి అడిగి సూరజ్‌ చెప్పగానే.. వెళ్లిపోతాడు.

ఇంటికి వెళ్లిన దీపను కాంచన తిడుతుంది. ఈ నాలుగు రోజులు బయటకు వెళ్లొద్దని చెప్తుంది. దీంతో మరి రెస్టారెంట్‌ అంటే అని దీప అడగ్గానే.. నాకు ఏం తెలియదు.. నువ్వు ఇంట్లోంచి మాత్రం బయటకు వెళ్లొద్దని చెప్తుండగానే.. సుమిత్ర ఫోన్‌ చేస్తుంది. దీప గురించి అడుగుతుంది. కార్తీక్‌ కంగారులో మీ అమ్మే అనగానే.. కాంచన అనుమానపడుతుంది. వెంటనే కార్తీక్‌ మాట మార్చేస్తాడు. తర్వాత కాల్‌ కట్‌ చేశాక..కాంచన బాధపడుతుంటే.. కార్తీక ఓదార్చి దీపకు నేనున్నాను.. నేను చూసుకుంటాను అంటూ ఇప్పటికీ చాలా లేట్‌ అయింది పడుకుందువు కానీ రా అంటూ దీపను తీసుకుని రూంలోకి వెళ్తారు.

Advertisement

ఇంటికి వెళ్లిన జ్యోత్స్న, పారిజాతంతో సూరజ్‌ గురించి మొత్తం చెప్తుంది. సూరజ్‌ ఆడుతున్న నాటకం గురించి చెప్తుంది. దీంతో పారిజాతం కోపంగా సూరజ్‌ ను తిడుతుంది. మనింట్లోనే ఉంటూ మనతోనే ఆటలాడుతున్నాడంట ఎంత ధైర్యం వాడికి అంటూ తిడుతుంటే.. వాడి ధైర్యం వాడి ఫోన్‌లో ఉన్న ఆ వీడియోనే గ్రాణి అంటుంది జ్యోత్స్న. దీంతో నువ్వెప్పుడు ఇంతే నీ పిలక తీసుకెళ్లి అవతలి వాళ్ల చేతుల్లో పెడుతుంటావు.. అంటూ పారిజాతం తిడుతుంది. కోపంగా జ్యోత్స్న ఫోన్‌ తీసుకుని సూరజ్‌కు కాల్‌ చేస్తుంది. జ్యోత్స్న వెంటనే కట్‌ చేస్తుంది.

సూరజ్‌ రిటర్న్‌ కాల్‌ చేసి తన నిద్ర డిస్టర్బ్‌ అయిందని నువ్వు వచ్చి సారి చెబితేనే నాకు నిద్ర పడుతుంది అంటూ డిమాండ్‌ చేస్తాడు. జ్యోత్స్న రానని కాల్‌ కట్‌ చేస్తుంది. కానీ పారిజాతమే బలవంతంగా పంపిస్తుంది. జ్యోత్స్న పాలు తీసుకుని వెళ్లి సూరజ్‌కు ఇచ్చి.. తనతో ఒక డీల్‌ మాట్లాడుతుంది. సూరజ్‌ను దీప వైపు ఉండమని.. కానీ తన కోసం పని చేయాలని అందుకు సూరజ్‌కు ఏం కావాలో అది ఇస్తానని చెప్తుంది. సూరజ్‌ సరే అంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×