BigTV English

Yuvraj Singh may join Gujarat Titans: ఐపీఎల్‌లో మార్పులు, గుజరాత్ కోచ్ రేసులో యువరాజ్!

Yuvraj Singh may join Gujarat Titans: ఐపీఎల్‌లో మార్పులు, గుజరాత్ కోచ్ రేసులో యువరాజ్!

Yuvraj singh as coach for Gujarat Titans(Sports news headlines): ఐపీఎల్-2025‌ పరిస్థితి ఏంటి? చాలా జట్లకు యాజమాన్యాలు మారుతున్నాయా? కోచ్‌‌లు సైతం కొత్తవాళ్లు వస్తున్నారా? ఈసారి ఐపీఎల్‌ని మరింత బలంగా తయారు చేసేందుకు ప్రణాళిక జరుగుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


వచ్చే ఏడాది ఐపీఎల్‌‌లో వివిధ జట్లకు యాజమాన్యాలు మారుతున్నాయి. ఆటగాళ్లు, కోచ్‌లు సైతం కొత్త వారు రాబోతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో మంతనాలు సాగిస్తోంది. తాజా గా గుజరాత్ జట్టు వంతైంది. ఈ టీమ్‌పై అదానీ గ్రూప్ కన్నేసింది. గుజరాత్ టైటాన్స్ యజమానులు, CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్ మెజారిటీ వాటాలను విక్రయించడానికి అదానీ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గుజరాత్ టీమ్‌కు కోచ్‌గా ఉన్న ఆశిష్‌నెహ్రా తప్పుకోనున్నట్లు సమాచారం. వచ్చే ఐపీఎల్ నాటికి ఆశిష్‌ నెహ్రా- విక్రమ్‌సోలంకి గుజరాత్ టైటాన్స్‌ను విడిచిపెట్టే అవకాశం ఉందన్నది అంతర్గత సమాచారం. ఈ జట్టుకు మెంటార్‌గా గ్యారీ‌ కిర్‌స్టన్ వ్యవహరించారు. రీసెంట్‌గా ఆయన పాక్ జట్టుకు కోచ్‌గా వెళ్లిపోయారు. దీంతో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్‌ను కోచ్‌గా తీసుకోవాలని ఆలోచన చేస్తోందట యాజమాన్యం. దీనిపై యువరాజ్‌సింగ్‌తో మంతనాలు జరుపుతోంది.


ALSO READ: సెమీస్ కి వెళ్లిన అమ్మాయిలు: నేపాల్ పై ఘన విజయం

ఇన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు యువీ. ఇటీవల మాజీ ఆటగాళ్ల మధ్య మ్యాచ్ జరిగింది. అందు లో యువీ టీమ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. దీంతో యాజమాన్యాల చూపు యువరాజ్‌పై పడడం, ఆయనతో గుజరాత్ జట్టు యాజమాన్యం మంతనాలు సాగించడం చకచకా జరిగిపోతున్నాయి.

అలాగే రిషబ్‌పంత్ ఈసారి చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడట. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈసారి బెంగుళూరు జట్టులోకి రానున్నాడు. ఈ లెక్కన చూస్తుంటే ఈసారి ఆటగాళ్లతోపాటు కోచ్‌లు మారే అవకాశముందని సమాచారం.

Tags

Related News

Shubman Gill: గిల్ టాలెంట్ లేదు…మార్కెటింగ్ కోసమే ఆసియా కప్ లోకి తీసుకున్నారు…మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Irfan Pathan: మా కెరీర్ నాశనం చేసిన కిరాతకుడు.. ధోనిపై పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు !

Dhanashree Verma: రణబీర్ కపూర్‌కు దగ్గరైన ధనశ్రీ వర్మ….హెల్త్ ట్రీట్మెంట్ ఇచ్చి !

Rohit Sharma: రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం.. 2036 వరకు ఆడేందుకు బిగ్ ప్లాన్ !

Kieron Pollard: 8 బంతులు… 7 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్… వీడియో చూస్తే

Big Stories

×