E-Paper
Advertisement

వారెవ్వా ఏం టాలెంట్.. ఓ విద్యార్ధి చేసిన పనికి అధికారులంతా షాక్!

వారెవ్వా ఏం టాలెంట్.. ఓ విద్యార్ధి చేసిన పనికి అధికారులంతా షాక్!
Advertisement

World Tourism: ప్రపంచ పర్యాటక దినోత్సవం-2026 సందర్భంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని యువ టూరిజం క్లబ్బుల విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించారు. ‘డిజిటల్‌ ఎజెండా అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టు రీడిజైన్‌ టూరిజం’ అంశంపై నిర్వహించిన పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పర్యాటక రంగంలో యువత పాత్ర కీలకం

విద్యార్థుల్లో పర్యాటక రంగంపై అవగాహన పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను వెలికితీయడమే పోటీల ఉద్దేశమని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో పర్యాటక రంగ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   

Advertisement

జిల్లాలోని కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, శామీర్‌పేట చెరువు, కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కు, జీనోమ్‌ వ్యాలీతో పాటు పలు ప్రముఖ ఆలయాలు హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని అదనపు కలెక్టర్‌ ఫైజన్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జిల్లా పర్యాటక అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.

Also read: వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Advertisement

మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నేరేడ్‌మెట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, వివిధ జిల్లా పరిషత్‌ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కాన్వాస్‌ పెయింటింగ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 9, 10వ తరగతి విద్యార్థులు పర్యావరణం, పర్యాటకం తదితర అంశాలపై రూపొందించిన చిత్రాలు ప్రశంసలు అందుకున్నాయి.జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చిత్రకళ రూపంలో రూపొందించి రాష్ట్రస్థాయి ఆర్ట్‌ గ్యాలరీల్లో ప్రదర్శించేలా విద్యార్థులకు తగిన శిక్షణ అందించాలని అదనపు కలెక్టర్‌ సంబంధిత ప్రిన్సిపాల్‌కు సూచించారు.

బహుమతులు, సర్టిఫికెట్ల ప్రదానం

పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు అదనపు కలెక్టర్‌ ఫైజన్‌ అహ్మద్‌ చిత్రపటాన్ని స్వయంగా గీసి ఆయనకు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం నోడల్‌ అధికారి సాంబశివరావు, జిల్లా విద్యాధికారి రేణుక, ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కిషన్‌, టూరిజం అధికారి దామోదర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శివప్రసాద్‌, డీపీఎం అభిలాష్‌రావు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Also read: రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

Tags

Related News

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, దంపతుల మృతి

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

Big Stories

Advertisement
×