E-Paper
Advertisement

బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. రూ. 442 కోట్ల ఆస్తుల జప్తు!

బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. రూ. 442 కోట్ల ఆస్తుల జప్తు!
Advertisement

Online Gaming Fraud: బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల మోసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి కఠిన చర్యలకు పూనుకుంది. ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్, రమ్మీటైమ్ టెక్నాలజీస్ సంస్థలకు చెందిన సుమారు రూ.442.35 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. తెలంగాణలో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్లు, కీలక అధికారుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో అనేక డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

బాట్‌ల మోసం.. కోట్లలో రాబడి

Advertisement

రమ్మీకల్చర్, రమ్మీప్రైమ్, ప్లేషిప్, రమ్మీటైమ్ వంటి యాప్‌ల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది యూజర్లను ఈ సంస్థలు ఆకర్షించాయి. ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్‌పై నిషేధం ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున గేమింగ్ కార్యకలాపాలు సాగించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. యూజర్లు పెట్టే బెట్టింగ్ మొత్తంలో 10% నుండి 15% వరకు కమీషన్ రూపంలో వసూలు చేయడమే కాకుండా, సాధారణ ఆటగాళ్లను ఓడించేందుకు రహస్యంగా బాట్స్ ఉపయోగించినట్లు విచారణలో బయటపడింది. దీనివల్ల వేలాది మంది యూజర్లు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారు.

ఆకర్షణీయమైన ఆఫర్లు.. విత్‌డ్రాపై ఆంక్షలు

Advertisement

కొత్త యూజర్లను బుట్టలో వేసుకునేందుకు ఈ కంపెనీలు ప్రకటనలు, ప్రమోషన్ల కోసమే సుమారు రూ.1,035 కోట్లు ఖర్చు చేశాయి. ఉచిత బోనస్‌లు, రిఫరల్ ఇన్సెంటివ్‌లు చూపుతూ నిరంతరం గేమ్స్ ఆడేలా.. మరింత డబ్బు డిపాజిట్ చేసేలా ప్రోత్సహించాయి. ఒకవేళ ఆటగాళ్లు తమ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే 5% నుంచి 10% వరకు ఛార్జీలు విధించడమే కాకుండా.. సూపర్ బూస్టర్ ఆఫర్ల పేరిట విత్‌డ్రా చేసుకునే మొత్తాన్ని తిరిగి గేమ్‌కే ఉపయోగపడేలా ‘గేమ్ క్యాష్’గా మార్చి తీవ్ర మోసానికి పాల్పడ్డాయని ఈడీ స్పష్టం చేసింది.

Also Read: హైదరాబాద్ సైబర్ క్రైమ్.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కే రూ. 14.61 కోట్ల టోకరా!

Tags

Related News

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వారెవ్వా ఏం టాలెంట్.. ఓ విద్యార్ధి చేసిన పనికి అధికారులంతా షాక్!

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కే రూ. 14.61 కోట్ల టోకరా!

సిరిసిల్లలో అడుగుపెట్టే ముందు ఇవి తేల్చు.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ బహిరంగ సవాల్!

Big Stories

Advertisement
×