E-Paper
Advertisement

గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్‌లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?

గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్‌లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?
Advertisement

BRS Tickets: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ గులాబీ దళంలో ‘సీట్ల’ రాజకీయం ఊపందుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ఏకైక ప్రామాణికంగా భారత్ రాష్ట్ర సమితి అధినాయకత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. గతంలో పాటించిన సాంప్రదాయాలకు భిన్నంగా, ఈసారి నియోజకవర్గాల్లో అసంతృప్తిని ఎదుర్కొంటున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు (సిట్టింగ్లు) చాలా మందికి టికెట్ల కోత తప్పదని సమాచారం. నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన సిట్టింగ్లకు చెక్ పెట్టి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసినట్లు సమాచారం.

ఆలోచనలో గులాబీ..

తెలంగాణలో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీలో ఉన్న సిట్టింగులను పక్కనబెట్టి కొత్త ముఖాలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చకపోవడంతోనే అధికారం కోల్పోయామనిఅనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు సైతం కామెంట్స్ చేశారు.దీంతో ప్రస్తుతం ఉన్న గులాబీసిట్టింగులను మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా వారి క్లిన్ ఇమేజ్ గెలుపునకు దోహదం చేస్తుందని అధిష్టానం లెక్కలు వేస్తోందని సమాచారం.

2023లో మూడవ సారి..

Advertisement

ఇక 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లోవరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ88 స్థానాలతో విజయం సాధించింది. వరుసగారెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 2023 లో మూడవ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 39 అసెంబ్లీ స్థానాలతో అధికారానికి దూరం అయింది.దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలనుమార్చకపోవడం ఓటమికి కారణం అంటూ రాజకీయ విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. సిట్టింగులను మార్చిన చోట మెజారిటీ స్థానాల్లో బిఆర్ఎస్ గెలిచింది.

Also read: iPhone 18 Pro లాంచ్‌కు డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ 9న యాపిల్ ఈ ప్రొడక్ట్స్ తీసుకురానుందా?

అధికారం వస్తుందనే భావన..

Advertisement

కేవలం 4 నుంచి 5 స్థానాల్లో మాత్రమే సిట్టింగులను మార్చిన చోట ఓడిపోయింది. దీంతో మారిస్తేనే మెజార్టీ సీట్లు సాధిస్తామని పలు సర్వేల్లోనూ వెల్లడైనట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు గులాబీ పార్టీకి కీలకంగా మారాయి.దీంతో సిట్టింగులను మారిస్తేనే తమకు అధికారం వస్తుందనే భావన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో ఉన్నట్లు సమాచారం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపై ప్రజల్లో ఇప్పటికీ వ్యతిరేకత ఉందట. ఈ విషయాన్ని గులాబీ అగ్ర నేతలు సైతం ప్రస్తావిస్తున్నారు.ఇకపదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు చేసిన ఓవరాక్షన్ తమ ఓటమికి ప్రధాన కారణంఅని అధిష్టానం వద్ద రిపోర్ట్స్ ఉన్నాయి. వారుచేసిన అవినీతి, ప్రజలకు అందుబాటులో లేకపోవడం లాంటి అంశాలను గులాబీ పార్టీ అధిష్టానం ప్రస్తావిస్తోంది.

లిస్ట్ ప్రిపేర్..

ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతలు ప్రస్తుతం ఇంఛార్జ్ లుగా కొనసాగుతున్నారు.మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి డీ లిమిటేషన్ అవుతుందనే ప్రచారంజరుగుతోంది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాలు పెరుగుతాయి. రిజర్వేషన్లు మారుతాయి.దీంతో పాత,కొత్త నేతలను అడ్జెస్ట్ చేయవచ్చని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒక వేళ డీలిమిటేషన్ కాకపోతే మాత్రం మెజారిటీ స్థానాల్లో సిట్టింగులను మార్చే యోచనలో అధిష్టానం ఉందని సమాచారం. ఎవరెవరని మార్చాలి. ఎక్కడ మార్చాలి అనే దానిపై ఇప్పటి నుంచే లిస్ట్ ప్రిపేర్ చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఎన్నికల నాటికి సిట్టింగుల పని తీరులో మార్పు రాకపోతే వారిని మార్చి కొత్త వారిని అసెంబ్లీ బరిలోకి దింపితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారని దీంతో ఎన్నికల్లో లబ్ది జరుగుతుందని బీఆర్ఎస్ అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం.

ప్రజల్లో యాక్టివ్‌గా..

మరోవైపు పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయిలో ప్రజల్లో యాక్టివ్ గా ఉన్న నేతలపై ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. ఇంటెలిజెన్స్, ప్రైవేట్ సర్వే ఏజెన్సీలతో పాటు పార్టీ అంతర్గత వర్గాల ద్వారా ఆయా నియోజకవర్గాల సమాచారాన్ని సేకరిస్తోందని సమాచారం. అదే విధంగా నియోజకవర్గంలో వివాదాలకు దూరంగా ఉంటూ, ప్రజలతో మమేకమయ్యే నేతలకే మొగ్గు చూపనున్నారు. వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్లను పక్కన పెట్టడానికి అధినాయకత్వం వెనుకాడబోదని ఓ సీనియర్ నేత తెలిపారు.

Also read: పనికిరాదనుకున్న పాత ఫోన్‌తో కూడా డబ్బు.. అమ్మే ముందు ఈ విషయాలు తెలిసుండాలి!

ప్రస్తుత పనితీరుపై..

అంతేకాదు గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన నాయకుల ప్రస్తుత పనితీరుపై కూడా ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తున్నారు. ఓటమి తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటూ పార్టీని బలోపేతం చేసిన వారికి ఈసారి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని సమాచారం. క్షేత్రస్థాయిలో మంచి పేరు ఉండి, గెలిచే గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందులో భాగంగానే కొత్త ముఖాలను రింగులోకి దించేందుకు ప్రణాళికలు సైతం సిద్ధమవుతున్నాయి.

టికెట్ రాని నేతలను..

టికెట్ దక్కని నేతలు నిరాశకు గురికాకుండా ఉండేందుకు, పార్టీ పరంగా తగిన న్యాయం చేస్తామని అధిష్టానం సంకేతాలు ఇస్తోంది. త్వరలో నియమించబోయే పార్టీ కమిటీలు, ఇతర పదవుల్లో కేవలం పని చేసే వారికే చోటు కల్పిస్తామని స్పష్టం చేస్తోంది. ఎన్నికల వేళ అసమ్మతి బయటపడకుండా, టికెట్ రాని నేతలను సమన్వయం చేసుకునేలా ముందస్తు వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికి, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అధిష్టానం అత్యంత ఆచి తూచి అడుగులు వేస్తోంది. గులాబీ పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగుల స్థానంలో ఎంత మందికి గులాబీ అధిష్టానం టిక్కెట్లు ఇస్తుంది?. ఎంత మందికి టిక్కెట్ ఇవ్వదో చూడాలి.

 Also read: సోనీ కంపెనీ ఫోన్లు తయారు చేయడం ఆపేసిందా? అసలు ట్విస్ట్ తెలిస్తే..

Tags

Related News

జలమండలిలో ఏఐ రెవెన్యూ డ్యాష్‌బోర్డ్.. ఏఐతో బకాయిల రికవరీకి స్కెచ్!

అమెరికా టు ఆగ్రా వయా హైదరాబాద్.. నిఖిత హత్య కేసులో చిక్కిన మాజీ ప్రియుడు, యూఎస్‌కు తరలింపు?

వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 30న ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్డులో వెళ్లేవారు జాగ్రత్త సుమా!

60 ఏళ్ల వివాదానికి చెక్.. పైగా భూములపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!

పరకాల కాక.. సీఎం రేవంత్ ‘ఇంట’ కొండా సురేఖ, రాఖీ సాకుతో రాజకీయ సంధి?

తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు.. ప్రయాణికులు ఫోన్‌ ద్వారా టికెట్‌ తీసుకోవచ్చు, అదెలా సాధ్యం?

నేపాల్లో హైదరాబాద్ యువతి మిస్సింగ్.. డీఆర్​డీవో మాజీ డైరెక్టర్​ సహా.. మరో 30 మంది సేఫ్!

Big Stories

Advertisement
×