BigTV English

khammam : చికెన్ వ్యర్థాల సేకరణ.. రికార్డు స్థాయిలో వేలం..

khammam : చికెన్ వ్యర్థాల సేకరణ.. రికార్డు స్థాయిలో వేలం..

khammam : ఖమ్మం కార్పొరేషన్ అధికారులు నగరంలోని చికెన్ వ్యర్థాల సేకరణకు వేలం వేశారు. రికార్డు స్థాయిలో చికెన్ వేస్టేజీ సేకరణ గద్వాల ప్రాంత వ్యక్తి దక్కించుకున్నారు . జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన బాలరాజు అనే వ్యక్తి ఏకంగా కోటి 55 లక్షల 60 వేలకు టెండర్ ను దక్కించుకున్నారు.


గతంలో ఈ టెండర్‌ను 44 లక్షల 44 వేలకు ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మూడురెట్లు అదనంగా ధర పలికింది. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించగా.. ఆరుగురు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగవేలంలో రాయల్టీ పాటగా 40 లక్షలు నిర్ణయించారు.

జోగులాంబ గద్వాల జిల్లా.. గద్వాలకు చెందిన బాలరాజు కోటి 55లక్షల 60వేలకు పాటను దక్కించుకున్నారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్ ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 200 పైగా ఉన్న చికెన్ దుకాణాల నుంచి వ్యర్ధాలను సేకరిస్తారు. వాటిని సాంకేతిక పద్ధతిలో పొడిగా మార్చి చేపల దాణాగా తయారు చేస్తారు. అనంతరం చేపల చెరువుల యాజమానులకు అమ్ముతారు. ఇలా చేసినందుకు నగరపాలక సంస్థకు రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ నిమిత్తం టెండర్లను ఆహ్వానించి బహిరంగ వేలం నిర్వహించగా ఊహించినదానికంటే ఎక్కువ రాయల్టీ లభించింది.


Related News

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Big Stories

×