E-Paper
Advertisement

రైలు వెళ్లాక టికెట్ ఇస్తే ఏం లాభం? ఓటరు లిస్ట్ సవరణపై ఉత్తమ్ సెటైర్లు

రైలు వెళ్లాక టికెట్ ఇస్తే ఏం లాభం? ఓటరు లిస్ట్ సవరణపై ఉత్తమ్ సెటైర్లు
Advertisement

Uttam Kumar Reddy: ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో వెలుగుచూస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర గొడ్డలిపెట్టుగా మారాయని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటలో రిఫరీ పాత్ర వహించాల్సిన ఎన్నికల కమిషన్‌పైనే ప్రజలకు అనుమానాలు మొదలైతే, అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితి మరొకటి ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం

Advertisement

రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు దేశ ప్రజల ఆస్తి అని, అది బీజేపీ సొత్తు కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పరికరంగా వాడుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (CJI) తొలగించి, కేంద్ర మంత్రిని చేర్చడం ద్వారా బీజేపీ తన మెజారిటీని ఖాయం చేసుకుందని విమర్శించారు. గతంలోనే రాహుల్ గాంధీ లేవనెత్తిన సందేహాలు నేడు నిజమవుతున్నాయని, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం తీవ్రతరం చేస్తుందని తెలిపారు.

సాంకేతికత పేరుతో ఓటు హక్కు బలి!

Advertisement

గోవాలో అర్హులైన 97 మంది పేర్లు తుది జాబితా నుంచి మాయం కావడంపై ఆయన నిలదీశారు. అధికారు పరిశీలన పూర్తయ్యాక కూడా సాఫ్ట్‌వేర్ పేరుతో ఓటు హక్కును తొలగించడం దారుణమని, మనిషి సౌకర్యం కోసం సాంకేతికత ఉండాలి తప్ప సాంకేతికత కోసం ఓటు హక్కును బలి ఇవ్వకూడదని హితవు పలికారు. ఓటు ఒక్కరిదైనా, వంద మందిదైనా హక్కు హక్కేనని తేల్చి చెప్పారు. 30 రాష్ట్రాల్లో దాదాపు 13 కోట్లకు పైగా పేర్లను తొలగించడంపై తక్షణమే పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి

ఎన్నికలు ముగిసిన తర్వాత పేర్లను పునరుద్ధరిస్తే ప్రయోజనం ఏమిటని, అది రైలు వెళ్లిపోయాక టికెట్ ఇచ్చినట్లే అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల సాంకేతిక వ్యవస్థపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: ఘోర ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ, 13 మంది బీహార్ కార్మికులకు గాయాలు!

Tags

Related News

రాహుల్ గాంధీ.. ఒకసారి మెంటల్ డాక్టర్‌ను కలవండి: కిషన్ రెడ్డి

10 సార్లు ఓటేసిన నా ఓటే తీసేస్తారా? నిజామాబాద్ వేదికగా టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!

ప్రకాశం జిల్లాలో జంటహత్యల కలకలం.. భార్య, అత్తల గొంతు కోసిన కిరాతకుడు!

అర్ధరాత్రి గణేశ్ శోభాయాత్రలో ఘోర ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు.. విగ్రహం ధ్వంసం!

బంగారంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్.. చివరికి షాకిచ్చిన దొంగలు?

గణేష్ నిమజ్జనం వేల తీవ్ర విషాదం.. పోలీసుల లాఠీఛార్జ్ భయానికి యువకుడు మృతి!

జాతీయస్థాయిలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఖ్యాతి.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×