Teacher MLC elections: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వెలువడిన విషయం తెలిసిందే.. మిగతా మూడు గ్రాడ్యుయేషన్ కోటా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. ఉపాధ్యాయ కోటాలో ఉత్తరాంధ్రలో గాదె శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ALSO READ: Teacher MLC elections: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి విజయం
తాజాగా ఆదిలాబాద్- నిజామాబాద్- కరీంనగర్-మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన విజయం సాధించారు.
మరి కాసేపట్లో విజేతను అధికారికంగా ప్రకటించనున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్యకు తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, టీయూటీఎఫ్ సపోర్టుగా నిలిచాయి. ఆయన గెలుపుకు తీవ్రంగా కృషి చేయడంతో కొమురయ్య ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు.