BigTV English

BRS MLAs: కాళేశ్వరం రిపోర్టుపై చర్చ.. వాకౌట్ చేసిన బీఆర్ఎస్, చెత్తబుట్టలో కమిషన్ కాపీలు

BRS MLAs: కాళేశ్వరం రిపోర్టుపై చర్చ.. వాకౌట్ చేసిన బీఆర్ఎస్, చెత్తబుట్టలో కమిషన్ కాపీలు

BRS MLAs:  తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాళేశ్వరం నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో దాదాపు 9 గంటలపాటు చర్చ జరిగింది. తొలుత అధికార పార్టీ దీనిపై చర్చ మొదలుపెట్టింది. ఆ తర్వాత విపక్ష బీఆర్ఎస్ సభ్యులు తమ వెర్షన్ చెప్పారు. చివరకు మాజీ మంత్రి హరీష్ రావు సభలో మాట్లాడారు.


పొలిటికల్ వెర్షన్‌లో చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించారు. కమిషన్ రిపోర్టుపై న్యాయస్థానంలో స్టే వస్తుందని భావించి అత్యవసరంగా అసెంబ్లీలో పెట్టారని సభలో వాదించే ప్రయత్నం చేశారు సదరు ఎమ్మెల్యే. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సరిగా విచారణ జరపలేదన్నారు.

ఈ క్రమంలో అధికార పక్షం జోక్యం చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీ మాట్లాడే సమయానికి సభ నుంచి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు గన్‌పార్క్‌ వద్ద నిరసన తెలిపారు. అమరవీరుల స్థూపం వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును చించి చెత్త బుట్టలో పారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.


ఈ క్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కమిషన్‌ రిపోర్టుని ట్రాష్‌ రిపోర్టుగా వర్ణించారు. అందుకే చెత్తబుట్టలో వేసినట్టు తెలిపారు. కమిషన్‌ ఏకపక్షంగా నివేదికను ఇచ్చిందని చెబుతూనే.. ఎన్డీఎస్‌ఏ, ఎన్డీఏ, పీసీ ఘోష్‌ నివేదికలను పీసీసీ రిపోర్టులని మండిపడింది.

ALSO READ: కాళేశ్వరం రిపోర్టు.. అర్థరాత్రి వరకు సభలో చర్చ.. సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ప్రకటన

కాళేశ్వరం నివేదికను బద్నాం చేస్తే.. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఆలోచన తప్ప రిపోర్ట్‌లో ఏమీ లేదన్నారు. వాస్తవానికి ప్రజల ముందు అన్నీ ఉన్నాయన్నారు. మా వాదన వినకుండా, క్రాస్ ఎగ్జామ్ చేయకుండా చట్టానికి ఉల్లంఘిస్తూ నివేదిక ఇచ్చిందన్నారు. కమిషన్ నివేదికపై న్యాయ పోరాటం చేస్తున్నామని, అది కంటిన్యూ అవుతుందన్నారు. రాజకీయంగా ఏం చేయాలనేది పార్టీ పరంగా కూర్చొని చర్చిస్తామన్నారు.

అంతకుముందు బీజేపీ వాకౌట్ చేసినా సభలో ఉండి ప్రసంగించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది అవాస్తవమన్నారు. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు తరలించడంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఒక్క చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు.

చిన్న చిన్న నదులు కలిసి ప్రాణహితగా మారుతుందన్నారు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నాయని చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. అక్కడ క్యాచ్‌మెంట్ ఏరియా లేదన్నారు. కమిషన్లు రావనే ఆలోచనతో మేడిగడ్డకు తరలించారని చెప్పుకొచ్చారు.

 

Related News

Etela Rajender: కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ.. నోరు విప్పిన ఈటల

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

Supreme Court: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి రిలీఫ్

KTR Angry: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింతపై కేటీఆర్ ఫైర్, న్యాయస్థానంలో హరీష్‌రావు పిటిషన్

Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. తొలిసారి కేంద్రమంత్రి సంజయ్ రియాక్ట్

Telangana RTC: ప్రమాదాల వేళ కొత్త నిర్ణయం..డ్యూటీలో డ్రైవర్లకు ఫోన్ కట్

Big Stories

×