Heavy Rains: వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో భారీ వర్ష సూచన
తెలంగాణలో ప్రస్తుతం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మబ్బులు కమ్మేస్తున్నాయి. దీంతో సాయంత్రం సమయంలో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం మొత్తం వణికిపోతుంది. ఇప్పుడు మరో అల్పపీడనం రాబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ప్రస్తుతం జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే మిగత ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..
ఏపీలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు పశ్చిమ బెంగాళ్-ఒడిశా తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. దీంతో ఏపీలో మరో 3 రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా రాయలసీమ, దక్షిణ కోస్తాఆంధ్ర, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు చెట్ల కింద, పాత భవనాల కింద ఉందకూడదని.. అలాగే అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: అప్పుడ హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..
పంజాబ్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత భీకర వరదలు
అటు పంజాబ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా మూడు లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. 1,018 గ్రామాలు నీట మునిగాయి. 1988లో వచ్చిన వరదల తర్వాత ఇప్పుడు అదే స్థాయిలో వరదలు పంజాబ్‌ను చుట్టుముట్టాయి. భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద విపత్తులకు ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది.