E-Paper
Advertisement

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!
Advertisement

BRS: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు వేదిక సిద్ధమవుతోంది. రాజధాని హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధిష్టానం ఈ స్థానంపై తీవ్ర దృష్టి సారించింది. దశాబ్ద కాలంగా గ్రేటర్ పరిధిలో ప్రజాప్రతినిధుల పరంగానూ, సంస్థాగతంగానూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న బీఆర్ఎస్.. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని వ్యూహాలు రచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలే ఏకైక ప్రామాణికంగా గులాబీ బాస్ సరికొత్త ముఖాల వేటలో పడినట్లు సమాచారం. యువతతో నిత్యం ఉండేవారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ముగియనున్న పదవికాలం..

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి ఖమ్మం, వరంగల్, నల్గొండ, రెండోది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి లో పదవీ కాలం ముగియనుంది. ఇక రెండు స్థానాలు గతంలో బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానాలుగా ఉన్నాయి. అయితే ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానంకు జరిగిన జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. సిట్టింగ్ స్థానంను చేజార్చుకుంది. అయితే 2027 మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పట్ట భద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్ సిట్టింగ్ స్థానంను తిరిగి దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

రేసు నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ అవుట్?

Advertisement

హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా వాణిదేవి పనిచేస్తున్నారు. అయితే ఆమె పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతుంది. పార్టీ సైతం కొత్తవారికి ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. కానీ వాణిదేవి మాత్రం పార్టీఅధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, మళ్లీ అవకాశం కల్పిస్తే పోటీ చేస్తానని అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ తనకు ఇవ్వకున్నా తనకుమార్తెకు టికెట్ ఇవ్వాలని పార్టీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే పార్టీ మాత్రం కొత్త అభ్యర్థికోసం కసరత్తు స్టార్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కీలకం కావడంతో పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది.

Also Read: ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!

ఇప్పటికే పలువురి పేర్ల పరిశీలన

Advertisement

సిట్టింగ్ ఎమ్మెల్సీ మార్పు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా సమర్థుడైన నేతను ఎంపిక చేసేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్ నగర సామాజిక వర్గాలు, ఆర్థిక బలం, పార్టీ పట్ల అంకితభావం ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. గ్రేటర్ పై బీఆర్ఎస్ కు బలమైన పట్టుంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను సైతం గెలుచుకుంది. ఒక మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే కొంత వెనుకబడింది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం, ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అంశాలను అమలు చేయకపోవడంతో గులాబీకి ప్లస్ అవుతుందని ఆశాభావంతో ఉంది. దీంతో పలువురి పేర్లను పరిశీలిస్తుంది.

కార్పొరేషన్ చైర్మన్లు..

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఐ.ఆర్.ఎస్ అధికారి ఉదయ్ కాంత్ కు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. బీసీసామాజిక వర్గానికి చెందిన అధికారి వీఆర్ఎస్ తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆయనతో పాటుసాట్స్ కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసిన ఈడిగ ఆంజనేయులు గౌడ్, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ల పేర్లను సైతం పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆంజనేయులు గౌడ్ ఉస్మానియా విద్యార్థి కావడం, ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ చేయడంలోనూ అవగాహన ఉంది. పలు ఎన్నికలకు నియోజకవర్గాలకు ఇన్ చార్జీగా పనిచేసిన అనుభవం సైతం ఉంది.

ఉపాధ్యాయులతో సమావేశం..

బీసీ వర్గానికి చెందిన నరేందర్ గౌడ్ సైతం ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల సమయంలోనూ హైదరాబాద్ టికెట్ ఆశించారు. అందుకోసం కసరత్తు సైతం చేశారు. అయితే చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం పీవీ నర్సింహరావు కుమార్తె వాణిదేవికి టికెట్ ఇచ్చింది. అయితే మళ్లీ ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. అందుకోసం ప్రయత్నాలు సైతం షురూ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ లో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడిరంగారెడ్డి జిల్లా పట్టభద్రుల, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. నరేందర్ గౌడ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నారు. విద్యార్థి, ఉద్యమ నాయకుడిగా గుర్తింపు ఉంది. స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ ఫ్రస్ట్రక్షర్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. ఈసారి పార్టీ అధిష్టానం ఆశీస్సులు పొందాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది నేతల పేర్లను సైతం పార్టీ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Also Read: నాగిని సీరియల్ నటిపై భారీ కుట్ర.. నిజాలు బయటపెట్టిన ప్రియుడు!

Tags

Related News

స‌బ్జెక్టు విడిచి క్షుద్ర‌పూజ‌ల‌ను త‌ల‌చి.. సీఎం నోటి వెంటా చేత‌బ‌డుల మాట‌.. జనం ఏమ‌నుకుంటున్నారు?

హరీశ్ రావు సంచలన లేఖ.. సీఎం రేవంత్ రెడ్డికి 5 కీలక ప్రశ్నలు!

రాజాసింగ్ కామెంట్స్ వెనుక అసలు కథేంటి..?

2 సీట్లు.. 3 పార్టీలు.. పట్టుభద్రుల ఓటు ఎవరివైపు..?

రీల్స్ రాజకీయం ఎంతవరకు వర్కవుట్ అవుతుంది?

BJP విందు రాజకీయాల వ్యూహమేంటి?

బెంగాల్ ఫార్మూలా… గుజ‌రాత్ హ‌మ్లా! ఇక్క‌డున్న‌ది మమ‌త కాదు.. రేవంత్‌..! జాగో తెలంగాణా !

Big Stories

Advertisement
×