Fee Reimbursement: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పదివేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఉన్నాయని అన్నారు. ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ పై ఆర్ కృష్ణయ్య, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం నూటికి నూరు శాతం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత మమ్మల్ని ప్రశ్నించాలని అన్నారు.
నవ్వితే నాకేటి సిగ్గు అన్నట్టుగా బిజెపి నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ ఎగవేతల వల్లే రీయంబర్స్మెంట్ ఆర్థిక భారంగా మారిందని, ఇకనుంచి ప్రతి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఏ ఏడాదిది ఆ ఏడాదే చెల్లిస్తామని సీఎం తెలిపారు. అడ్వాన్సుగా బ్యాంకు ఖాతాల్లో పెడుతునన్నాం అని, ఇక నుండి ప్రతి సంవత్సరానికి రూ.2400 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సీఎం రేవంత్ తెలిపారు.
Also Read: భార్యను కత్తితో బెదిరించి.. ఒంటికి నిప్పు అంటించుకున్న భర్త!
క్రమం తప్పకుండా ఇకనుంచి ఫీజు రీబర్స్మెంట్ చెల్లిస్తామని, ఇక నుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తున్నామని, గ్లోబరీనా సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల సిబిఎస్ఈ లో సైతం అక్రమాలు చేశారని సీఎం రేవంత్ అన్నారు. ఇకపై భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఉండదని 8000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట బకాయిలు పెట్టిందని సీఎం ఫైర్ అయ్యారు. బిజెపి నేతలు బిఆర్ఎస్‌కు వంత పాడుతున్నారని సెటేర్లు వేసారు.
Also Read: తెలంగాణ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. టీవీ ఆర్టిస్టులకు ‘సర్కార్ బంపర్ ఆఫర్!