CM Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతూ సీఎం లేఖ రాశారు.
స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42శాతానికి పెంచాలని రెండు బిల్లులను ఏకగ్రీవంగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో సీఎం పేర్కొన్నారు. అయితే, బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడటం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బిల్లులకు ఆమోదముద్ర పడిన అనంతరం సభ రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన బీసీ నేతలు అంతా మీడియా పాయింట్ వద్ద సమావేశం అయ్యి ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సర్కార్ ఇచ్చిన మాటకు కట్టుబడి, సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు కృషి చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో కూడా ఆమోదం పొందేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
అయితే పార్లమెంట్ లో కూడా బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందేందుకు సీఎం రేవంత్ రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ALSO READ: CM Revanth Reddy: యువతకు భారీ గుడ్ న్యూస్.. రూ.4,00,000 స్కీం ప్రారంభించిన సీఎం రేవంత్