BigTV English

CM Revanth Reddy: వాజ్‌పేయికి ఉన్న గౌరవం రాష్ట్రంలో ఆయనకు ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: వాజ్‌పేయికి ఉన్న గౌరవం రాష్ట్రంలో ఆయనకు ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రాజకీయాల్లో వాజ్‌పేయికి ఉన్న గౌరవం బండారు దత్తాత్రేయకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ బుక్ ఆవిష్కరణలో సీఎం మాట్లాడారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ అంటే ప్రజల మనిషి అని  సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. దత్తన్న ఏ పదవి చేపట్టినా సరైన న్యాయం చేశారని వ్యాఖ్యానించారు.


‘గౌలీగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఆయనది సుదీర్ఘ ప్రయాణం. ఆయన జీవితంలో ఎన్నో పదవులు అధిష్టించినా ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదు. దత్తాత్రేయతో వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆయన్ని నేను చాలా దగ్గరగా చూశాను. అజాత శత్రువు అనే పదం బండారు దత్తాత్రేయకు సరిగ్గా సరిపోతుంది. దేశ స్థాయిలో అటల్ బిహారీ వాజ్ పేయిలా రాష్ట్రంలో మనకు దత్తన్న ఉన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా మన రాష్ట్రంలో దత్తాత్రేయని రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ALSO READ: Cm Revanth Reddy: ఏపీపీ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్


‘రాజకీయాలకు అతీతంగా ఆయన నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి అందరూ హాజరవుతారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినపుడు గుర్తొచ్చేది ఇద్దరే నాయకులు.. ఒకరు పీజేఆర్, మరొకరు దత్తాత్రేయ. మేం తీసుకునే నిర్ణయాల్లో పీజేఆర్, దత్తాత్రేయ స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ALSO READ: inter students: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారికీ కూడా

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×