E-Paper
Advertisement

Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్

Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్
Advertisement

Students Conflict: గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య ఓ మేకు చిచ్చు పెట్టింది. హాస్టల్ గదిలో గోడకు మేకు కొట్టడం..కొందరు విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణమైంది. చిన్నగా మొదలైన గొడవ..పెద్దదిగా మారి..విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టుకున్నారు. విద్యార్థుల గొడవతో హాస్టల్ ఆవరణ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది.

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల హాస్టల్‌లో స్కూల్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు కొట్టుకున్నారు. హాస్టల్ గదిలో స్కూల్ విద్యార్థులు..రాత్రి గోడకు మేకు కొడుతుండగా..వద్దని ఇంటర్ స్టూడెంట్స్ వాదించారు. డిస్ట్రబ్ అవుతుందని ఇంటర్ విద్యార్థులు గట్టిగా చెప్పడంతో…స్కూల్ విద్యార్థులు అంతేదీటుగా సమాధానం చెప్పారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా..పెద్దగా మారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు.. పాఠశాల విద్యార్థులపై దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిదో తరగతి విద్యార్థి దీపక్‌కు తీవ్ర గాయాలు కాగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. మరొకరిని కిందపడేసి విచక్షణారహితంగా కాళ్ళతో తన్నడంతో గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఇంటర్ విద్యార్థుల దాడిలో ఓ విద్యార్థి దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోయినట్లు విద్యార్థులు చెబుతున్నారు. తోటి విద్యార్థులే బాధితుల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల విద్యాలయం బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేసి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ALSO READ: DWCRA Fraud: మెప్మా, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం.. ఏకంగా రూ.65 కోట్లు స్కామ్

Advertisement

Related News

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

Big Stories

Advertisement
×