E-Paper
Advertisement

రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ.. ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్!

రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ.. ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్!
Advertisement

Dasoju Sravan: స్వేచ్ఛ బ్యూరో: జీబీజీ రామ్ జీ అమలుకై రాష్ట్ర ప్రభుత్వ ఆమోదాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారిక విధానానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నూతన చట్టాన్ని తక్షణమే తిరస్కరించాలని, ఢిల్లీ డిక్టేట్‌ను పక్కనబెట్టి, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని లేకుంటే సమాఖ్య హక్కుల కోసం పోరాడాలని కోరారు. శనివారం కాంగ్రెస్ లోక్ సభ నేత రాహుల్ గాంధీకి శనివారం బహిరంగలేఖ రాశారు.

వడ్డీతో సహా జీతాలు చెల్లించాలి

Advertisement

మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్  జీతాలను వెంటనే విడుదల చేయాలని, జీతాలను తక్షణమే వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వ పే-స్కేల్ వర్తింపజేయాలన్నారు. మిగతా స్థాయిల ఉద్యోగుల మాదిరిగానే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా  ఎఫ్ టీఈలుగా కన్వర్ట్ చేసి, నెలకు కనీస వేతనం రూ. 25వేలు ఇవ్వాలన్నారు. ఃకాంగ్రెస్ 2024 జాతీయ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా ఉపాధి కూలీల దినసరి వేతనాన్ని రూ. 400లకు పెంచుతూ, ఏడాదికి 150 రోజుల పని దినాలుకల్పించాలన్నారు. లిస్ట్ 3 కింద తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా, అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.

Also Read: సింగరేణి మనుగడకు కొత్త ప్లాన్.. రాబోయే 15 ఏళ్ల కోసం కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు!

Advertisement

ఢిల్లీవేదికగా జాతీయ స్థాయిలో ఎండగడతాం..

జీబీజీ రామ్ జీ విధానంపై అసలు మీకు ఒక జాతీయ విధానం అంటూ ఉందా, లేదా?  భారత ప్రభుత్వం .. మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా, ఈ ఉపాధి హామీ విధానం ప్రాథమిక చట్రాన్ని, నిర్మాణాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించిందన్నారు. ఏఐసీసీ కేంద్ర ప్రభుత్వ బిల్లును వ్యతిరేకించిందో అదే బిల్లును తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్‌లో ఎలా ఆమోదిస్తారు?.. ఢిల్లీ మాటలకు, హైదరాబాద్ పార్టీ చేతలకు అస్సలు పొంతన ఉందా? అని నిలదీశారు.  ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీల న్యాయమైన సమస్యల సాధనకై గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉధృతమైన ఆందోళనలు, ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.  డిల్లీవేదికగా మీ రాజకీయ  ద్వంద విధానాలను, బీజేపీతో ఢిల్లీలో కుస్తీ, తెలంగాణలో దోస్తీనెరుపుతూ చేస్తున్న అక్రమ రాజకీయాలను డిల్లీవేదికగా జాతీయ స్థాయిలో ఎండగడతాం అని స్పష్టం చేశారు.

Also Read: రంకెలతో అంకెలు మారవు.. ఏ చర్చకైనా సిద్ధం.. హరీశ్ రావు సవాల్!

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×