Liquor Prices: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు ‘ప్రియం’కానున్నాయి. తయారీ వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో తమకు చెల్లించే బేసిక్ ప్రైస్ ను సవరించాలని డిస్టిలరీలు ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మద్యంపై 8శాతం వరకు ధరలను పెంచవచ్చని సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చినట్టు సమాచారం. డిస్టిలరీల డిమాండ్ ను నెరవేర్చటమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకుగాను ఎక్సయిజ్ శాఖ ఈ కసరత్తు చేసింది. మద్యం ధరల పెంపుపై కమిటీ ఇచ్చిన నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టుగా తెలిసింది. సీఎం ఆమోద ముద్ర లభించగానే ధరలను సవరించనున్నట్టు సమాచారం.
అమెరికా.. ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో గాజు సీసాల తయారీ ఖర్చు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. దాంతోపాటు కరెంట్ ఛార్జీలు, కార్టన్ బాక్సుల రేట్లతోపాటు మద్యం తయారీకి ఉపయోగించే రెక్టిఫైడ్ స్పిరిట్, ధాన్యాల రేట్లు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో తమకు వచ్చే లాభాలు తగ్గుపోయాయని డిస్టిలరీల నిర్వాహకులు చెబుతున్నారు. ఉద్యోగుల వేతనాలు కూడా పెరిగి పోవటంతో పాత ధరలకే మద్యాన్ని డిపోలకు సప్లయ్ చేయటం సాధ్యపడదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి బేసిక్ ప్రైస్ ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఐఎంఎఫ్ ఎల్ బ్రాండ్లు, ప్రీమియం బ్రాండ్లు, బీర్ల ధరలను కనీసం 8శాతం పెంచుతూ ధరలను సవరించవచ్చని నివేదికను ఇచ్చింది.
కాగా, మద్యంపై ఎక్సయిజ్ డ్యూటీని కూడా పెంచాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అమలవతుతున్న పన్నుల విధానాన్ని పరిశీలిస్తున్న అధికారులు ఇతర రాష్ట్రాల్లో ఎక్సయిజ్ డ్యూటీతో వాటిని పోలుస్తున్నారు. ఎక్సయిజ్ డ్యూటీని పెంచినట్టయితే ప్రభుత్వానికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. డిస్టిలరీ బేసిక్ ప్రైస్ కు ఎక్సయిజ్ డ్యూటీ, స్పెషల్ ఎక్సయిజ్ ప్రైస్, వ్యాట్, టీఎస్బీసీఎల్ మార్జిన్, రిటైల్ ఔట్ లెట్ల వ్యాపారుల లాభాలను జోడించి ఎమ్మార్పీని ఖరారు చేస్తామన్నారు. ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు, అదనపు ఎక్సయిజ్ డ్యూటీ ద్వారా సమకూరే ఆదాయంపై అంచనాల నివేదికలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించినట్టు చెప్పారు.
Also Read: బెస్ట్ మోడల్ ఇయర్ బడ్స్..ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే!
తెలంగాణలో త్వరలోనే మద్యం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మద్యం తయారీ వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో తమకు చెల్లించే బేసిక్ ప్రైస్‌ను సవరించాలని డిస్టలరీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ఉన్నతస్థాయి ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ.. మద్యం ధరలను సుమారు 8 నుంచి 10 శాతం వరకు పెంచవచ్చని సిఫారసు చేస్తూ నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి తోడు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో ఎక్సైజ్ డ్యూటీని కూడా పెంచే అంశాన్ని అబ్కారీ శాఖ పరిశీలిస్తోంది. కరెంట్, రవాణా చార్జీలు, గ్లాస్ బాటిళ్లు, కార్టన్ బాక్సుల ధరలు పెరగడంతోపాటు మద్యం తయారీకి ఉపయోగించే రెక్టిఫైడ్ స్పిరిట్, ధాన్యాల వంటి ముడిసరుకుల వ్యయం కూడా పెరిగిందని డిస్టలరీలు ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. కూలీల వేతనాలు పెరగడంతో పాత ధరలకే డిపోలకు మద్యం సరఫరా చేయడం కష్టంగా మారిందని, బేసిక్ ప్రైస్‌ను పెంచాలని కోరాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. డిస్టలరీల ప్రతిపాదనలు, ముడిసరుకుల ధరలు, తయారీ వ్యయాన్ని పరిశీలించిన కమిటీ.. సాధారణ ఐఎంఎఫ్‌ఎల్ బ్రాండ్లు, ప్రీమియం బ్రాండ్లు, బీర్ల కేటగిరీలను బట్టి 8-10 శాతం వరకు ధర సవరణ సమంజసమని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మద్యం ధరల పెంపుతోపాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించే అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఎక్సైజ్ సుంకాలను పరిశీలిస్తున్న అధికారులు.. తెలంగాణలో పన్నుల శ్లాబులను సవరించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు.
మద్యం ధర నిర్ణయం తయారీదారుడి బేసిక్ ప్రైస్, ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ ఎక్సైజ్ సెస్, వ్యాట్, టీఎస్బీసీఎల్ మార్జిన్, రిటైల్ వ్యాపారుల మార్జిన్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. చివరిసారిగా 2022 మేలో మద్యం ధరలు పెరిగాయి. ఎక్సైజ్ డ్యూటీని 2020 మేలో కరోనా లాక్‌డౌన్ అనంతరం పెంచారు. ప్రస్తుతం అబ్కారీ శాఖ రెండు నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒకటి ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ సూచించిన 8-10 శాతం ధరల పెంపు ప్రతిపాదన కాగా.. మరొకటి అదనపు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై ఆర్థిక అంచనాలు. ఈ రెండు ప్రతిపాదనలను త్వరలో ముఖ్యమంత్రి ఆమోదానికి పంపనున్నారు. సీఎం ఆమోదం లభిస్తే ధరల పెంపుపై అబ్కారీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
Also Read: పాకిస్తాన్ జట్టు మాకు ఈకతో సమానం…3-0 తేడాతో వైట్ వాష్ చేస్తాం