BigTV English

Hyderabad: బెదిరించే ప్రభుత్వం కాదు.. ప్రజా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Hyderabad: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ పెట్టి ‘ప్రజాపాలన దరఖాస్తు’లను స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ప్రకటించారు. ప్రజలు ఎవరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని పేర్కొన్నారు.

Hyderabad:  బెదిరించే ప్రభుత్వం కాదు.. ప్రజా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Hyderabad: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పాల్గొన్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ పెట్టి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ప్రకటించారు. ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు.


తమ ప్రభుత్వం వ్యక్తికో, ఒక వర్గానికో చెందింది కాదని స్పష్టంచేశారు. తమ పార్టీ‌కి వస్తేనే ఇల్లు మంజూరు చేస్తామని బెదిరించే ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రజా పాలన అందించాలని దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపారు.

రాష్ట్రంలో గత పదేళ్లలో ప్రజలు నిధులు , నీళ్లు, నియామకాలు పొందలేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు సరిగా మంజూరు చెయ్యలేదని విమర్శించారు. తమది దొరల ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తామని భట్టి ప్రకటించారు .


‘అభయహస్తం’లో మోసాలకు అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నేటి నుంచి జనవరి 6 వరకు ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని మంత్రి ప్రకటించారు. బంజారాహిల్స్‌ లో నిర్వహించిన ప్రజా పాలన‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలు ఉంటే అధికారులను అడిగి పరిష్కరించుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో 600 కేంద్రాల్లో ప్రజల వద్దకే పాలన పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. పథకాలు అమలులో ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సృష్టం చేశారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×