E-Paper
Advertisement

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల

Panchayat Elections:  సర్పంచ్ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల
Advertisement

Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సన్నద్దం కావడంతో ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను కసరత్తును ప్రారంభించింది.

ఫైనల్ ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్

Advertisement

త్వరలో ప్రారంభమయ్యే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఫైనల్ ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కసరత్తను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు, ఫైనల్ ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ALSO READ: Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Advertisement

సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీల్లో ఓటర్ల లిస్ట్..

వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 2వ తారీఖున గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 28న గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆగస్టు 29న జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు.

ALSO READ: AAI Jobs: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 ఉద్యోగాలు.. మంచి వేతనం, ఎంపికైతే లైఫ్ సెట్

ఈ నెల 30 అభ్యంతరాలు స్వీకరణ..

ఆగస్టు 30న మండల స్థాయిలో ఎంపీడీవోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు తుది ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి సమస్యలను పరిష్కరించనున్నారు. సెప్టెంబర్ 2వ తారీఖును అధికారులు ఓటర్ల ఫైనల్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×