Big Stories

Farmers Died : తీవ్ర నష్టం.. తీరని విషాదాన్ని మిగిల్చిన భారీ వర్షం

Farmers Died in Telangana(Local news telangana): తీవ్ర ఎండల నుంచి భారీ వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది కానీ.. రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగించింది. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పలుచోట్ల పిడుగులు పడి రైతులు కన్నుమూశారు. పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు, గాలి వానకు గోడకూలి మరో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

- Advertisement -

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో, మెదక్ జిల్లా మాసాయిపేటలోనూ మార్కెట్ యార్డులు, కల్లాల వద్ద ఆరబోసిన వరిధాన్యం భారీ వర్షానికి తడిచిపోయింది. పలుప్రాంతాల్లో ధాన్యం.. వర్షపునీటిలో కొట్టుకుపోయింది. వర్షానికి తడిచి, చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

- Advertisement -

Also Read : బాచుపల్లిలో తీవ్ర విషాదం.. గోడ కూలి ఏడుగురు దుర్మరణం, సీఎం దిగ్భ్రాంతి

సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులకు మామిడి తోటలు నేలకొరిగాయి. భారీవృక్షాలు సైతం విరిగిపడ్డాయి. గాలివానకి మెదక్ జిల్లా కౌడిపల్లి (మం) రాయిలపూర్ నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అలాగే.. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో బావి వద్దకు వెళ్తుండగా పిడుగుపడి మల్లేశం(33) అనే రైతు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామ శివారులో పిడుగుపడి మరో రైతు మృతి చెందారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News