Fire accident: హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు వచ్చాయి. పొగలు బయట వరకు వ్యాపించాయి.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో.. శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్భంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంతో ఏఐజీ ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా ప్రమాదంలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు వీఐపీలు ఎక్కువగా చికిత్స తీసుకునే ఆస్పత్రిలో ఇలా జరగజడంతో ఫైర్ సేఫ్టీపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.