HCU Students: హెచ్‌సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నీర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులపై ఏ కేసులు అయితే నమోదయ్యాయో వాటిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.
ఇవాళ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో హెచ్‌సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుదిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి చర్చించిన అనంతరం డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులకు సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో హెచ్‌సీయూ విద్యార్థులకు ఊరట లభించింది.
ALSO READ: IDBI Recruitment: డిగ్రీతో ఐడీబీఐలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. లక్షల్లో జీతాలు భయ్యా..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సెక్రటేరియట్ లో సమావేశమైంది. ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పలువురు మంత్రులు ఉన్నారు. ఈ సమావేశానికి యూనివర్శిటీస్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు, తదితరులు అటెండ్ అయ్యారు. ఈ మేరకు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు, మీనాక్షి నటరాజన్ కు, మంత్రులకు పలు విజ్ఞప్తులు చేశారు.
ఈ సమావేశంలోనే విద్యార్థులపై కేసులతో పాటు యూనివర్శటీ క్యాంపస్ నుంచి పోలీస్ బలగాలను వెంటనే వెనక్కి రావాలని, నిషేద ఆజ్ఞలను ఉపసంహరించుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను రేవంత్ సర్కార్ బ్యాక్ తీసుకుంది. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రులు నిర్ణయించారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యహహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కంచ గచ్చిబౌలి భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విదితమే. వంద ఎకరాల్లో చెట్లను తొలగించడం పట్ల సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ALSO READ: BEL Jobs: హైదరాబాద్, బెల్‌లో ఉద్యోగాలు.. మంచి సాలరీ, ఇంకా 2 రోజులే గడువు
ALSO READ: Rajiv Yuva Vikasam: రూ.4,00,000 స్కీంకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా వారం రోజులే గడువు మిత్రమా..!