E-Paper
Advertisement

మంత్రి పొంగులేటి స్పీచ్.. అడ్డుకున్న పాడి కౌశిక్ రెడ్డి

మంత్రి పొంగులేటి స్పీచ్.. అడ్డుకున్న పాడి కౌశిక్ రెడ్డి
Advertisement

Hanamkonda: హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చివరకు రాజకీయం రణరంగంగా మారింది. లబ్ధిదారులకు ఇండ్లు అందజేసే శుభకార్యం కాస్తా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల సవాల్-ప్రతి సవాల్‌లతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సభా వేదికపైనే ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం నడవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

‘కేసీఆర్ కట్టారు’.. ‘మేమే పూర్తి చేశాం’

Advertisement

సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను సగంలోనే వదిలేసిందన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేసిందని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ‘బరాబర్ ఈ ఇండ్లను కేసీఆరే కట్టించారు’ అని బిగ్గరగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య ఒకరిపై ఒకరు అరిచే పరిస్థితి వచ్చింది.

అప్పుల గోల.. వేదికపైనే ఘర్షణ

Advertisement

అనంతరం మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల వల్లే ఇప్పుడు పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విమర్శించారు. పొంగులేటి మాటలకు ఆగ్రహంతో ఊగిపోయిన కౌశిక్ రెడ్డి, వేదికపైనే లేచి నిలబడి మంత్రులతో నేరుగా వాగ్వాదానికి దిగారు.

Also Read: రెండేళ్లలో కేసీఆరే సీఎం.. నర్సంపేట కాలేజీకి పెద్ది పేరే: కేటీఆర్

సభలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోటీపడి నినాదాలు చేసుకోవడంతో తీవ్ర రసాభాస నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి, బీఆర్ఎస్ శ్రేణులను సభా ప్రాంగణం నుంచి బయటకు పంపించి వాతావరణాన్ని అదుపులోకి తెచ్చారు.

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×