E-Paper
Advertisement

కెమెరా ఉన్న ఎయిర్‌పాడ్స్.. డిజైన్ మారిన వాచ్ అల్ట్రా.. యాపిల్ 2026 ఈవెంట్‌పైనే అందరి కళ్లు!

కెమెరా ఉన్న ఎయిర్‌పాడ్స్.. డిజైన్ మారిన వాచ్ అల్ట్రా.. యాపిల్ 2026 ఈవెంట్‌పైనే అందరి కళ్లు!
Advertisement

Apple Event 2026: యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 సెప్టెంబర్ ఈవెంట్‌కు సమయం దగ్గరపడింది. ప్రతిఏటా సెప్టెంబర్ నెలలోనే కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడం కంపెనీకి ఒక ఆనవాయితీ. ఆ సాంప్రదాయం ప్రకారమే ఈసారి కూడా సెప్టెంబర్ 8 లేదా 9 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగవచ్చని భావిస్తున్నారు. ఈ వేదికపై యాపిల్ తీసుకోబోయే కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు, లాంచ్ చేయనున్న ఉత్పత్తులపై ఓ లుక్కేద్దాం.

ఎంతో ఆసక్తిగా తొలి ఫోల్డబుల్ ఐఫోన్:

ఈ కార్యక్రమంలో అందరి దృష్టినీ ఆకర్షించబోయేది యాపిల్ నుంచి రానున్న తొలి మడతపెట్టే ఫోన్ iPhone Ultra. పుస్తకంలా తెరుచుకునే ఈ డివైజ్ డిస్‌ప్లేపై మడత మార్క్ (క్రీజ్) అసలు కనిపించకుండా ఉండేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇదొక కొత్త మైలురాయి కానుంది.

శక్తివంతమైన iPhone 18 Pro సిరీస్:

Advertisement

ఫోల్డబుల్ కాకుండా సాధారణ మోడల్స్ ఇష్టపడే వారి కోసం ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ వేరియంట్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో పెర్ఫార్మెన్స్, కెమెరా ఫీచర్లు, బ్యాటరీ లైఫ్‌ను భారీగా పెంచబోతున్నారు. అయితే సాధారణ ఐఫోన్ 18 మోడల్ మాత్రం ఈ ఏడాది రావడం లేదు.

Also Read: షాకింగ్.. భారత్‌లో మళ్లీ పెరిగిన Vivo X300 FE ధర.. ఏకంగా రూ.10,000 పెంపు!

యాపిల్ వాచ్ సిరీస్ 12, అల్ట్రా 4:

Advertisement

స్మార్ట్‌వాచ్ విభాగంలో వాచ్ సిరీస్ 12తో పాటు వాచ్ అల్ట్రా 4 రాబోతున్నాయి. సిరీస్ 12 మోడల్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులే ఉన్నప్పటికీ.. వాచ్ అల్ట్రా 4 మాత్రం డిజైన్, ఫీచర్ల పరంగా భారీ అప్‌డేట్‌తో రానుందని సమాచారం.

కెమెరాలు, ఏఐతో ఎయిర్‌పాడ్స్ అల్ట్రా:

ఈసారి యాపిల్ నుంచి ‘ఎయిర్‌పాడ్స్ అల్ట్రా’ పేరిట కొత్త బడ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వీటిలో కెమెరాలను అమర్చి, మన కంటికి కనిపించే విజువల్స్ ఆధారంగా సమాధానాలు ఇచ్చేలా అడ్వాన్స్డ్ సిరి ఏఐ టెక్నాలజీని అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇతర స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు:

వీటితో పాటు హోమ్‌పాడ్స్, యాపిల్ టీవీ లాంటి స్మార్ట్ హోమ్ పరికరాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లను కూడా కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. సాధారణ ఐఫోన్ 18 వెర్షన్ వచ్చే ఏడాదికి వాయిదా పడినప్పటికీ.. రాబోయే ఫోల్డబుల్ డివైజ్, ప్రో మోడల్స్ టెక్ ప్రపంచంలో సరికొత్త ఊపు తెచ్చేలా కనిపిస్తున్నాయి.

Also Read: iPhone Ultra లుక్ లీక్.. ఈ కలర్స్ చూస్తేనే యాపిల్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది!

Tags

Related News

రూ.849కే బ్లూటూత్ స్పీకర్.. దీని ముందు హోమ్ థియేటర్ బలాదూర్

ధర ఎక్కువైనా వర్త్ అనిపించే ఫీచర్లు.. OnePlus 16లో రాబోతున్న క్రేజీ చేంజెస్ ఇవే!

హోటళ్లలో Wi-Fi వాడుతున్నారా? అయితే.. మీ వీడియోలు బయటకొస్తాయ్!

బ్యాచిలర్స్,చిన్న ఫ్యామిలీలకు బెస్ట్..కేన్‌స్టార్ ఫ్రిజ్ పై భారీ డిస్కౌంట్

షాకింగ్.. భారత్‌లో మళ్లీ పెరిగిన Vivo X300 FE ధర.. ఏకంగా రూ.10,000 పెంపు!

iPhone Ultra లుక్ లీక్.. ఈ కలర్స్ చూస్తేనే యాపిల్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది!

మైక్రోవేవ్ ఓవెన్లలపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ పోతే రాదు వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×