E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Harish Rao: పౌరుషం ఉంటే రాజీనామా చెయ్.. మంత్రి జూపల్లికి హరీశ్ రావు ఓపెన్ ఛాలెంజ్!

Harish Rao: పౌరుషం ఉంటే రాజీనామా చెయ్.. మంత్రి జూపల్లికి హరీశ్ రావు ఓపెన్ ఛాలెంజ్!
Advertisement

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం సవాళ్లు చేసి చివరకు తోక ముడిచిందని అన్నారు. గోల్ కొడతామనుకుని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని, మత్రి జూపల్లి కృష్ణారావు రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్‌కు వచ్చి సవాల్ విసిరారని అన్నారు. కేటీఆర్, నేను తెలంగాణ భవన్‌లో ఉంటే చర్చకు రాలేదని అన్నారు. చీమూ నెత్తురు ఉంటే, పాలమూరు పౌరుషం ఉంటే జూపల్లి రాజీనామా చేయాలంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రూ.8 లక్షల కోట్ల అప్పు అన్నారు.. ఈరోజు రూ.7 లక్షల కోట్ల అప్పు అంటున్నారని, జూపల్లి మాట తప్పారని వెంటనే ఆయన రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

హిట్లర్‌ను ఆదర్శంగా..

అప్పులపై గతంలోనే అసెంబ్లీ సాక్షిగా మేము లెక్కలు చెప్పామని, తోక ముడిచింది మీరే పోలీసులను పెట్టి చర్చను అడ్డుకున్నారని అన్నారు. గురుకుల టెండర్లలో అవకతవకలు జరిగాయని నేను, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ ఆధారాలతో మాట్లాడామని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మొదట ప్రెస్ క్లబ్‌కు వస్తానన్నారని, తర్వాత హరీశ్ రావే రావాలని షరతులు పెట్టారని గుర్తు చేశారు. మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావడానికి సిద్ధమైతే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. హిట్లర్‌ను ఆదర్శంగా చెప్పే సీఎం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమని ఎద్దేవ వేశారు. మమ్మల్ని గన్‌పార్క్‌కు కూడా రానివ్వలేదు. అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌లకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదని అన్నారు. టెండర్లలో అవినీతి జరిగిందని తేటతెల్లమైందని, కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో కుర్చీలు ఏర్పాటు చేసినా చర్చకు రాలేదని ఫైర్ అయ్యారు.

Advertisement

Also read: Vehicle Dealers: టీఆర్ నెంబర్ లేకుండా బండి డెలివరీ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

2017లో చేనేత కార్మికులకు..

గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్లకు పిలిచారు. కానీ పత్రికల్లో రూ.200 కోట్ల గోల్‌మాల్ జరిగిందని వచ్చిందని అన్నారు. రూ.1,142 కోట్లు, రూ.200 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? ఈ టెండర్ విధానంపై కొందరు కోర్టును ఆశ్రయించారని, మొదటి నుంచే పిల్లలు తినే ఆహారం, గుడ్ల కొనుగోళ్లలో కూడా స్కాం జరిగిందని చెబుతున్నామని అన్నారు. పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, గరం మసాలా వంటి వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేశారని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు జీవో తీసుకొచ్చిందని, పోలీసు, పాఠశాల, గురుకుల యూనిఫాంల ఆర్డర్లు టెస్కోకే ఇవ్వాలనే నిబంధన ఉండేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చిందని ఫైర్ అయ్యారు. దీనిపై మేము కోర్టుకు వెళ్తే చేనేత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని న్యాయమూర్తి నందా ఆదేశించారని, అయినా అమలు చేయకపోవడంతో వీరాంజనేయ హ్యాండ్‌లూమ్ సొసైటీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. చివరికి ఈ కేసులో కూడా హైకోర్టు చేనేత కార్మికుల జీవనోపాధిపై దెబ్బ కొట్టొద్దని హరీష్ రావు అన్నారు.

జీవో ప్రకారం బట్టలు..

Advertisement

ఎం రేవంత్ రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న దయ చేనేత కార్మికులపై లేదని ఫైర్ అయ్యారు. “మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు” అన్నదే ప్రభుత్వ వైఖరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జీవో నెం.110 తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం బట్టలు, బూట్ల కొనుగోళ్లు లిడ్‌క్యాప్ ద్వారా జరగాలి. మీ ప్రభుత్వం వల్ల ఒక శాఖ మరో శాఖపై కోర్టుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. లిడ్‌క్యాప్ నుంచి ఆర్డర్లు లాక్కొని దళిత బిడ్డలను మోసం చేశారని అన్నారు. కేసీఆర్ హయాంలో మాకే ఆర్డర్లు ఇచ్చేవారని లిడ్‌క్యాప్ లేఖ రాసింది. అలాంటప్పుడు స్కాం జరగలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మద్దతుతోనే మీరు జడ్పీ చైర్మన్ అయ్యారని, మంత్రి శ్రీధర్ బాబుకు కూడా లిడ్‌క్యాప్ లేఖ రాసిందని గుర్తు చేశారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయిని బదిలీ చేశారని, మంత్రి శ్రీధర్ బాబు సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు మేము ఇలా చేశామా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు.

Also Read: Paperless Cabinet: తొలి పేపర్ లెస్‌గా తెలంగాణ కేబినెట్ సమావేశం.. మూసీ, మెట్రోపై కీలక నిర్ణయాలు

Related News

BJP Telangana: 30 ఏళ్ల సీనియర్లమని బిల్డప్ ఇస్తే కుదరదు.. తెలంగాణ బీజేపీ లీడర్లకు మైండ్ బ్లాక్ వార్నింగ్..?

R&B Transfers: ఆర్అండ్‌బీ శాఖలో వింత పోకడలు.. 14 ఏళ్లుగా ఒకే సీటు.. నేటికీ నో ట్రాన్స్‌ఫర్..?

Paperless Cabinet: తొలి పేపర్ లెస్‌గా తెలంగాణ కేబినెట్ సమావేశం.. మూసీ, మెట్రోపై కీలక నిర్ణయాలు

Vehicle Dealers: టీఆర్ నెంబర్ లేకుండా బండి డెలివరీ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

NMC Inspection: మంత్రి దామోదర రాజనర్సింహ వ్యూహం సక్సెస్.. సీట్ల భర్తీకి లైన్ క్లియర్!

Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

Rural Employment: ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. కనీస వేతనం ఫిక్స్.. తెలంగాణలో కొత్త రేట్లు ఇవే..!

Big Stories

×