Kim Jong-Un Special Train: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ సాధారణంగా రైల్లోనే విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. రష్యా, చైనా సహా ఇతర దేశాలకు ఆయన రైలు ద్వారానే జర్నీ చేస్తారు. తాజాగా చైనా పర్యటనకు ఆయన రైల్లో బయల్దేరారు. సోమవారం నాడు ప్యోంగ్యాంగ్ నుంచి రైలులో బీజింగ్ కు బయల్దేరారు. నిజానికి ఈ రోజుల్లో చాలా దేశాధినేతలు విమానాల్లో పర్యటిస్తున్నా, కిమ్ మాత్రం రైల్లోనే వెళ్తారు. ఇంతకీ ఆయన విమానాల్లో కాకుండా రైళ్లలో విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్తారు? ఇంతకీ ఆయన ప్రయాణించే రైలు ప్రత్యేక ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కిమ్ రైలు ద్వారానే విదేశాలకు ఎందుకు వెళ్తారు?
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, తన పూర్వీకుల మాదిరిగానే, రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఈ రైళ్లు నెమ్మదిగా, సురక్షితంగా ప్రయాణం చేస్తాయి. ఒకేసారి ఎక్కువ మందిని తీసుకెళ్లడంతో పాటు సౌకర్యవంతమైన స్థలం, భద్రతా దళాలు, ఆహారం, సౌకర్యాలు, సమావేశాలకు ముందు అజెండాలను చర్చించడానికి అవసరమైన హాల్ ను కలిగి ఉంటుంది. 2011 నుంచి, కిమ్ ప్రత్యేక రైళ్లను ఉపయోగించి చైనా, వియత్నాం, రష్యా పర్యటనలు చేశారు.
రైళ్లలో ఉండే ప్రత్యేకతలు ఏంటంటే?
ఉత్తర కొరియా అధినేత ఎన్ని రైళ్లు ఉపయోగిస్తున్నారో కచ్చితంగా తెలియదు. కానీ, ఉత్తర కొరియా రవాణా నిపుణుడు అహ్న్ బైయుంగ్ మిన్ ప్రకారం.. రక్షణ వ్యూహంలో భాగంగా ఆయన రైలు ప్రయాణం చేస్తారని వెల్లడించారు. ఇందుకోసం ఆయనకు పలు రైళ్లను అందుబాటులో ఉంచుతారు. ఒక్కో రైలులో 10 నుంచి 15 క్యారేజీలను కలిగి ఉంటాయి. వాటిలో కొన్ని బెడ్ రూమ్ లు ఉంటాయి. వాటిని కిమ్ మాత్రమే ఉపయోగిస్తాయి. మరికొన్నింటిలో భద్రతా సిబ్బంది, వైద్య సిబ్బంది ఉంటారు. కిమ్ కార్యాలయం, కమ్యూనికేషన్ ఎక్యుప్ మెంట్, రెస్టారెంట్, సాయుధ కార్లను తీసుకెళ్లే క్యారేజీలు ఉంటాయి. ఉత్తర కొరియా స్టేట్ టీవీ 2018లో పింక్ సోఫాలతో ఉన్న రైలు క్యారేజీలో కిమ్ చైనా అధికారులను కలుస్తున్నట్లు చూపించిన వీడియోలను ప్రసారం చేసింది. ఇందులో ఒక డెస్క్, కుర్చీ, వాల్ మీద చైనా, కొరియన్ ద్వీపకల్పం మ్యాప్ లు ఉన్నాయి.
ఈ రైళ్లు దేశ సరిహద్దులను ఎలా దాటుతాయి?
2023లో అధ్యక్షుడు పుతిన్ తో శిఖరాగ్ర సమావేశం కోసం ఆయన ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. ఇందుకోసం రెండు దేశాలు వేర్వేరు రైలు గేజ్ లను ఉపయోగిస్తున్నందున సరిహద్దు స్టేషన్ లో చక్రాల కాన్ఫిగర్ చేశారు. చైనాలోకి ప్రయాణించడానికి ఎటువంటి మార్పులు చేర్పులు అవసరం లేదు. కానీ సరిహద్దు దగ్గర చైనీస్ లోకోమోటివ్ ఆ రైలును లాగుతుంది. ఎందుకంటే ఈ లోకోమోటివ్ కు స్థానిక ఇంజనీరింగ్ రైలు వ్యవస్థ, సిగ్నల్స్ గురించి తెలుసు. ఈ రైళ్లు చైనాలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఉత్తర కొరియా ట్రాక్ లపై గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఉత్తర కొరియాలో నాయకులంతా రైల్లోనే ప్రయాణం..
కిమ్ జోంగ్ ఉన్ మాత్రమే కాదు, అతడి తాత కిమ్ ఇల్ సంగ్ 1994లో మరణించే వరకు రైళ్లలోనే పర్యటనలు చేశారు. అతడి తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కూడా రైళ్లలోనే వెళ్లేవారు. కిమ్ తండ్రి రైలు ప్రయాణం చేస్తూనే గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత కింగ్ జోంగ్ ఉన్ కూడా ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇది అత్యాధునిక భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.
Read Also: విశాఖలో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్.. ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందంటే?