BigTV English

Miss World Competition 2025: మిస్‌ వరల్డ్‌ పోటీలు.. హైదరాబాద్‌‌లో హై అలర్ట్‌

Miss World Competition 2025: మిస్‌ వరల్డ్‌ పోటీలు.. హైదరాబాద్‌‌లో హై అలర్ట్‌

Miss World Competition 2025: అందాల పోటీలకు సిద్ధమైంది హైదరాబాద్‌. సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ప్రపంచ సుందరిని ఎన్నుకునేందుకు.. మరింత అందంగా రెడీ అవుతోంది. మే10న జరగబోతున్న పోటీలకు ఏర్పాట్లన్నీ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. ఎందరో సుందరీమణులు నరగానికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చూసి మురిసిపోతున్నారు. మిస్ట వరల్డ్‌ పోటీల్లో పాల్గొంటున్న అభ్యర్థులు రిహార్సల్స్‌ కూడా చేశారు.


హైదరాబాద్‌లో సందడే సందడి

నగరంలో 100కిపైగా దేశాల బ్యూటీ క్వీన్లు


అంతర్జాతీయ కంటెస్టెంట్ల రాకతో పెరిగిన జోష్‌

హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలకు అంతా సిద్ధమైంది. ఈనెల 10వ తేదీ సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో మిస్‌ వరల్డ్‌ పోటీలు అధికారింగా ప్రారంభంకానున్నారు. సమయం దగ్గర పడటంతో.. ఏర్పాట్లు జోరందుకున్నాయి. మిస్‌ వరల్డ్‌ పోటీలకు హైదరాబాద్‌ నగరం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

హైదరాబాద్‌ చేరుకున్న 95 దేశాల పోటీదారులు

ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 95 దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. వివిధ దేశాల నుంచి మరికొంత మంది ప్రతినిధులు రెండు రోజుల్లో వస్తారని నిర్వాహకులు తెలిపారు. మిస్ వరల్డ్ సంస్థ నుంచి 28 మంది ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. అతిథులందరినీ తెలంగాణ సంసృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతున్నారు. వారి ఉండేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. విదేశీ ప్రతినిధులు ట్రిడెంట్ హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్‌ దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు.

విదేశీ ప్రతినిధులకు ట్రిడెంట్ హోటల్లో బస

మిస్‌ వరల్డ్‌ కంటెస్టంట్ల రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. పోటీదారులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. వారు పాల్గొనబోయే కార్యక్రమాలకు సంబంధించి బ్రీఫింగ్‌ ఇస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన కంటెస్టంట్లు విభిన్న కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాల సందర్శనలో పాల్గొంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్ట్‌లో భాగం చేశారు. ఏర్పాట్లపై ఇప్పటకే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన సలహాలు, సూచనలు చేశారు.

పర్యాటక రంగ అభివృద్ధితోపాటు.. పెట్టుబడుల సాధన, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు

ప్రకృతి, పర్యావరణ పరంగా అన్నిహంగులు ఉన్నా.. పర్యాటక రంగంలో తెలంగాణ వెనుకబడింది. ఇకపై తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల.. పర్యాటక రంగ అభివృద్ధితోపాటు.. పెట్టుబడుల సాధన, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈవెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దేశవిదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఏయిర్‌పోర్టుల్లో కూడా ప్రచారం కల్పిస్తోంది.

మొత్తం 5వేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భాగంగా.. ఈ నెలాఖరు వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని సామాన్యులకు కూడా కల్పిస్తున్నారు. అయితే… పరిమిత సంఖ్యలో మాత్రమే సామాన్యులను అనుమతిస్తున్నారు. టూరిజం వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఐదు కేంద్రాల్లో వేయి మందికి చొప్పున.. మొత్తం 5వేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

మిస్‌వరల్డ్‌ పోటీలకు భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్ కేంద్రంగా మిస్‌వరల్డ్ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. రేపు గచ్చిబౌలి స్టేడియంలో జరగబోయే ఓపెనింగ్ కార్యక్రమానికి పాస్‌‌లు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ఇక 300 నుంచి 350 మందితో భారీ బందోబస్తు ఉండనుంది. దేశ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్రిక్తతలతో సెక్యూరిటీ మరింత టైట్ చేశారు అధికారులు.

Also Read: పాక్ లో అంతర్యుద్ధం? సైన్యం తిరుగుబాటు? పాకిస్తాన్ షట్టర్ క్లోజ్

గచ్చిబౌలి స్టేడియం, HICC, హోటల్స్ వద్ద భద్రత కట్టుదిట్టం

మరోవైపు ఇప్పటి వరకు 103 మంది కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకున్నారు. గచ్చిబౌలి స్టేడియం, HICC, కంటెస్టెంట్స్ ఉండే హోటల్స్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. కంటెస్టెంట్స్ ప్రయాణించే రూట్స్ మొత్తం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, పోలీసులతో కోఆర్డినేట్ చేయనున్నారు. తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ సీపీ ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేయనున్నారు. ఇటు మాదాపూర్ పరిధిలో మొత్తం 500 మంది బందోబస్తులో ఉంటారు. మాదాపూర్ జోన్ పరిధిలో క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×