E-Paper
Advertisement

Function Zone: సామాన్యులకు గుడ్ న్యూస్.. 25 వేలకే నెక్లెస్ రోడ్డులో ఫంక్షన్ హల్..!

Function Zone: సామాన్యులకు గుడ్ న్యూస్.. 25 వేలకే నెక్లెస్ రోడ్డులో ఫంక్షన్ హల్..!
Advertisement

Function Zone: స్వేచ్చ బ్యూరో: శరవేగంగా అభివృద్ది, పట్టణీకరణ చెందుతున్న కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సామాన్యుడికి అందుబాటులో లేని ఫంక్షన్ హాళ్ల అద్దెలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చెక్ పెట్టేందుకు సిద్దమైంది. అరకొర వసతుల మధ్య కొనసాగుతున్న ఫంక్షన్ హాల్స్, బ్యాంక్విట్ హాల్స్ లకు భిన్నంగా సకల సౌకర్యాలతో భారీ కెపాసిటీతో నెక్లెస్ రోడ్డులో ఫంక్షన్ జోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్ఎండీఏ సిద్దమైనట్లు సమాచారం. గతంలో కొద్ది ఏళ్ల క్రితం వరకు కూడా ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహాం సర్కిల్ కు వెళ్లే రూట్‌లో ఎడమ సైడు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఎకానమీ రేట్లకే అన్ని రకాల ఫంక్షన్లు చేసుకునేందుకు వీలుగా ఓ వేదిక ఉండేది. వీటిలో కేవలం నామమాత్రపు అద్దెలకు బర్త్ డే, మ్యారేజ్ డే, గెట్ టు గెట్, ఆఫీసు పార్టీలు వంటివి నిర్వహించే వారు. కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత అది కనుమరుగు కావటంతో మళ్లీ ఆ వేదికను పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా హెచ్ఎండీఏ ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఫంక్షన్ జోన్..

సాగర తీరాన చక్కటి సిటీ వ్యూ మధ్య కేవలం ధనిక వర్గాలు మాత్రమే కాకుండా నామమాత్రపు అద్దె ధరలకు పేద, మధ్య తరగతి ప్రజలు వినియోగించుకునేలా పార్క్ వ్యూలో ఫంక్షన్ జోన్ లో అందుబాటులోకి తేవాలని హెచ్ఎండీఏ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు గాను నెక్లెస్ రోడ్డు ఐమాక్స్ వైపు, అటు పీవీ నర్సింహారావు విగ్రహానికి సమీపంలో స్థలాలను హెచ్ఎండీఏ గుర్తించినట్లు సమాచారం. రెండు చోట్ల స్థలాలను గుర్తించిన హెచ్ఎండీఏ కనీసం దాదాపు 700 మంది నుంచి 800 మంది ఫంక్షన్ జరుపుకునేందుకు వీలుగా ఈ ఫంక్షన్ జోన్ ను సుమారు రూ. కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన హెచ్ఎండీఏ త్వరలోనే పనులు చేపట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. చక్కటి లుక్ తో, పచ్చదనం ఎక్కువగా ఉండేలా, రాత్రి పూట వెలుగులు జిగేల్ మనేలా రైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తుంది. ఈ ఫంక్షన్ జోన్ కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నామకరణం చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Also read: Harish Rao: పౌరుషం ఉంటే రాజీనామా చెయ్.. మంత్రి జూపల్లికి హరీశ్ రావు ఓపెన్ ఛాలెంజ్!

అందరికీ అందుబాటులో ఛార్జీలు..

సుమారు ఏకరం స్థలంలో ఈ ఫంక్షన్ జోన్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న హెచ్ఎండీఏ దీని అద్దె ఛార్జీలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఒక రోజుకు కనిష్టంగా రూ. 25 వేల నుంచి రూ. 30 వేల లోపు ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇది కేవలం ప్రాంగణం ఛార్జీలుగా వసూలు చేయాలని, వంటలు బయటే తయారు చేసుకుని తెచ్చుకోవాలన్న నిబంధనను పెట్టాలా? లేక వంటలు ఇక్కడే అనుమతించాలా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. ఈ జోన్ రాత్రి పూట ఎంతో అందంగా, ఆకర్షనీయంగా రంగురంగులు వెలుగులు జిమ్ముతూ కన్పదించేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నందున, అద్దె ఛార్జీలను తక్కువకు ఫిక్స్ చేసి, అవసరమైతే కరెంటు ఛార్జీలు అదనంగా వసూలు చేయాలన్న ప్రతిపాదనను కూడా హెచ్ఎండీఏ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. నెక్లెస్ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ ఫ్లో ఉంటున్నందున, ఈ జోన్ లో జరిగే ఫంక్షన్లలో మద్యపానం పై నిషేధం కూడా విధించే అంశాన్ని హెచ్ఎండీఏ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Also read: BJP Telangana: 30 ఏళ్ల సీనియర్లమని బిల్డప్ ఇస్తే కుదరదు.. తెలంగాణ బీజేపీ లీడర్లకు మైండ్ బ్లాక్ వార్నింగ్..?

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×