E-Paper
Advertisement

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను.. స్ధానిక నేతల్లో టెన్షన్ టెన్షన్!

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను.. స్ధానిక నేతల్లో టెన్షన్ టెన్షన్!

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను
–అధికార పార్టీ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రణాళిక
–స్వతంత్రులతో మ్యాజిక్​ ఫిగర్​ పూర్తి చేయాలని నేతలు నిమగ్నం
–క్యాంపులతో కాపాడుకునేందుకు పార్టీలు యత్నం
–చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఓటు ఎటువైపో
–ఈనెల 16వ తేదీ వరకు టెన్షన్​ టెన్షన్​

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ప్రచార శైలి, పోలింగ్ ప్రక్రియల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించి ఫలితాలు అత్యధిక స్ధానాలు దక్కించుకోవడం ఒక ఎత్తుగడ. గెలిచిన స్ధానాలను కాపాడుకోని చైర్మన్​, వైస్​ చైర్మన్​ పదవులు దక్కించుకోవడం మరోక ఎత్తుగడ అని పార్టీల నేతలు వాపోతున్నారు. నగరానికి దగ్గరల్లో ఉన్న మున్సిపాలిటీతో పొలిస్తే జిల్లాలోని మున్సిపాలిటీ వ్యవహారమే బెటర్​గా ఉంటుంది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాలోని మున్సిపాలిటీల్లో హంగు ఏర్పాడితే ఆయా పార్టీల నేతల తంటాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరికి పార్టీ పదవుపై కన్నేస్తే… మరోకరు ఆశించిన నగదు ఇవ్వాలనే డిమాండ్​ ఉంటుంది. అవేమీ కాకుండా పెద్ద పెద్ద కొరికలను తిర్చుకునేందుకు కౌన్సిలర్లు వెనుకడుగు వేయరని సమాచారం. గతంలో అనేక సార్లు ఇలాంటి పరిస్థితి నెలకొంది. చైర్మన్ పీఠం ఆశించే అభ్యర్ధులు కచ్చితంగా అడిగినంత నగదును అందిచాల్సిన అవసరం ఉంది. ఏలాగైన పార్టీ అభ్యర్థులే చైర్మన్​ పీఠం దక్కించుకోవాలని నేతలు తహతహాలాడుతారు. ఈనెల 16వ తేదీ వరకు చైర్మన్​ పీఠంపై నేతల్లో టెన్షన్​ టెన్షన్ ఉంటుంది.

అమన్​గల్లు పట్టణ కాంగ్రెస్​లో నైరాశ్యం..

ఉమ్మడి మహాబూబ్​నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన అమన్గల్, షాద్​నగర్​ మున్సిపాలిటీలు విలీనం అయ్యాయి. ఈ మున్సిపాలిటీల్లో షాద్​నగర్​ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్​ కైవసం చేసుకునే అవకవాశం మొండుగా ఉంది. అదేవిధంగా అమన్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్​కు ఘోరంగా ఎదురుదెబ్బ తాకింది. అధికారంలోను కాంగ్రెస్​ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో విఫలమైనట్లు స్పష్టమైతుంది. అమన్​గల్ మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. ఇదులో బీఆర్​ఎస్​ 8, బీజేపీ 6, కాంగ్రెస్​ ఒక స్ధానాల చోప్పున గెలుచుకున్నాయి. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో అమన్గల్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ ప్రభుత్వంలో బీఆర్ఎస్​ చైర్మన్​ పీఠం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ లోపాయికారీగా కాంగ్రెస్​, బీఆర్ఎస్​ పార్టీలు చర్చలు సాగించి బీజేపీకి అవకాశాలు దక్కకుండా చేస్తున్నాయా లేదా… బీజేపీతో కాంగ్రెస్​ అంతర్గత చర్చలతో ఒక్కటైతున్నాయా అనే గుసగుసలు పట్టణంలో వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైన అమన్గల్​ ఫలితాలతో కాంగ్రెస్​ పార్టీకి బలం లేకుండా పోయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్​ ఎమ్మెల్యే చూట్టుపక్కలనున్న కొద్దీ మంది నాయకుల చెప్పుడు మాటలతోనే కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందనే ప్రచారం సాగుతుంది.

Also Read: Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్‌లో కమలం కవాతు, మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో బీజేపీ

చైర్మన్​ పీఠం ఎవరీ ఖాతాలోకి..

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్​లో 26 స్ధానాలున్నాయి. ఇందులో 10 స్ధానాలు కాంగ్రెస్​, 7 స్ధానాలు బీఆర్ఎస్​, 4 స్ధానాలు బీజేపీ, 5 స్ధానాలు స్వతంత్రులు పోటీలో నెగ్గారు. అయితే చైర్మన్​ పీఠం దక్కించుకోవాలంటే 14 స్ధానాలు ఏ పార్టీ దక్కించుకుంటే వారికే వరిస్తుంది. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపోందిన ఐదుగురు అధికార పార్టీకి మద్దతు పలికితే ఏలాంటి ప్రయత్నాలు లేకుండానే పీఠం దక్కించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక వేళ స్వతంత్ర అభ్యర్థుల్లో ఇద్దరూ బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే కాంగ్రెస్కు తిప్పలు తప్పవు. అంతేకాకుండా స్వతంత్రులతో పాటు బీజేపీ అభ్యర్థులు బీఆర్​ఎస్​ అభ్యర్ధికి మద్దతు ఇస్తే కాంగ్రెస్ చైర్మన్​ పీఠం దక్కించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్స్​ ఆఫీసియో ప్రకారం కొరం ఉన్నప్పటికి 10తో పాటు 2 కలిపితే మొత్తం 12 అవుతాయి… అదే బీఆర్ఎస్​ స్వతంత్రులతో పాటు బీజేపీలను కలిసి చైర్మన్​ పీఠం దక్కించుకునే అవకాశం ఉంటుందని సమాచారం. కానీ అదే ఎమ్మెల్యే ఓటు బీఆర్ఎస్​ కు వేస్తారా… కాంగ్రెస్​ వైపు ఉంటారా అనే చర్చ నడుస్తుంది.

నువ్వా నేనా అనే రేంజీలో..

బీఆర్ఎస్​ అభ్యర్ధిగా ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్ధులకు మద్దతు పలికితే మరో హాస్త్రం బీఆర్ఎస్కు దోరికే అవకాశం ఉందని సమాచారం. వికారాబాద్​ జిల్లాలోని పరిగి మున్సిపాలిటీలో హంగు రావడం ఆశ్చరానికి గురిచేసింది. అభివృద్ధి పథకాల ప్రారంభంతో సీఎం రేవంత్​ రెడ్డిగా బహిరంగ సభ పెట్టినా ఫలితాలను బట్టి చూస్తే ప్రభావం లేదని చెప్పాలి. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లు నువ్వా నేనా అనే రేంజీలో అభ్యర్ధులు పోటీ పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​ 8, బీఆర్ఎస్​ 8 చోప్పున అభ్యర్థులను కైవసం చేసుకున్నారు. మొత్త్ం 18 స్ధానాల్లో 10 ఏ పార్టీ దక్కించుకుంటే వాళ్లకే చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది. అయితే స్వతంత్రులు ఇద్దరు గెలిచినప్పటికి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై క్లారిటీ లేదని తెలుస్తోంది. దాదాపు అధికార పార్టీవైపే స్వతంత్రులు వెళ్లే ఆలోచన ఉంటుంది. ఒక వేళ స్వతంత్రులు బీఆర్​ఎస్ వైపు వెళ్లితే కాంగ్రెస్​ ఎక్స్​ ఆఫీసీయో తె ప్రభావం చేసే స్ధాయి లేదని కూడా తెలుస్తోంది.

అలియాబాద్​ పీఠంపై ఉత్కంఠ..

మేడ్చల్​ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉంటే ఒక మున్సిపాలిటీపై నేతలకు ఉత్కంఠగా మారింది. ఏ పార్టీకి సరియైన మేజార్టీ స్ధానాలు దక్కించుకోకపోవడంతో నేతలు వ్యూహాలు చేస్తున్నారు. అలియాబాద్లో 20 వార్డులుంటే ఏ పార్టీకి పూర్తి స్థాయి మేజార్టీ లేదు… మూడు చింతలపల్లిలో 24 వార్డులుంటే బీఆర్ఎస్​ పార్టీకి పూర్తి మేజార్టీ స్ధానాలు దక్కాయి. మరోక మున్సిపాలిటియైన ఎల్లంపేట్లో 24 వార్డులుంటే ఒక స్ధానం తక్కువతో 12 స్ధానాలతో బీఆర్ఎస్​ సరిపెట్టుకోని ఇరుకన పడింది. అయితే చైర్మన్​ పీఠం దక్కించుకోవాలంటే ఎమ్మెల్యే ఓటును ఎక్స్​ ఆఫీసీయో కింద పరిగణిస్తారు. కనుక అలియాబాద్​, ఎల్లంపేట్ మున్సిపాలిటీలల్లో ఎక్కడ ఓటు వినియోగించుకోవాలని మేడ్చల్​ ఎమ్మెల్యే మల్లారెడ్డి తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Edupayala Temple: జాతరకు ముస్తాబైన ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం

మరో రెండు మున్సిపాలిటీల్లో..

మూడు చింతలపల్లి చైర్మన్​ పీఠం బీఆర్ఎస్​ దక్కించుకోగా.. మరో రెండు మున్సిపాలిటీల్లో పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు చేస్తుంది. బీఆర్ఎస్ వ్యూహాలను కట్టడి చేసేందుకు అధికార కాంగ్రెస్​ సైతం ప్రణాళికలు చేస్తోంది. కాంగ్రెస్​ పీఠం దక్కించుకోవాలంటే అలియాబాద్లో 8 స్ధానాలు దక్కించుకుంది. మరో మూడు ఓట్ల మద్దతు అవసరం.. బీజేపీ పార్టీకి మూడు స్ధానాలు వచ్చాయి.. బీఆర్​ఎస్​, బీజేపీలు కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి చైర్మన్​ పదవి చే జారినట్లే అవుతుంది. అదే ఎల్లంపేట్లో కాంగ్రెస్​ ఖాతాలోకి రావాలంటే ఐదు ఓట్లు అవసరం. ఆ ఓట్లు కాంగ్రెస్​ పార్టీ ఎక్స్​ అఫీసియోతో భర్తీ చేయాలి. కానీ అంత సులభంగా ఎక్స్​ ఆఫీసియో వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఏదీ ఏమైన మేడ్చల్​ జిల్లాలోని మూడు స్ధానాలు కాంగ్రెస పార్టీ వదులుకోని బీఆర్ఎస్కు అప్పగించడమే బాధ్యత అనే ప్రచారం ఉంది.

ఇబ్రహీంపట్నం అభ్యర్ధులతో క్యాంపు రాజకీయాలు..

రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నంలో అత్యధిక మున్సిపాలిటీలను బీఆర్ఎస్​ కైవసం చేసుకుంది. మొత్తం 24 మున్సిపాలిటీలుంటే 13 స్ధానాలు ఎవరు దక్కించుకుంటే వారికే చైర్మన్​ పీఠం దక్కుతుంది. కానీ అధికార పార్టీ ఎక్స్​ ఆఫీసియో ఓటింగ్​తో పీఠం దక్కించుకునేందుకు వ్యూహాలు చేస్తాయి. ఇలాంటి వ్యూహాలనే గత ప్రభుత్వంలోనే కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కేవలం 8స్ధానాలను దక్కించుకుంది. పీఠం దక్కించుకోవాలంటే 9 ఓట్ల మద్దతును సంపాదించుకోవాలి. అది సాధ్యమైతుందా లేదా అనే విషయాలను పక్కకు పెడితే.. కాంగ్రెస్​ పార్టీ సైతం క్యాంపులు నిర్వహించడంపై నియోజకవర్గంలో చర్చనీయంశంగా మారింది. మరో వైపు బీఆర్ఎస్ 14 మంది అభ్యర్ధులతో క్యాంపు నిర్వహించింది. ఈ క్యాంపులో లోకల్ నాన్ లోకల్ అనే అభిప్రాయాలు వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఇబ్రహీంపట్నం పట్టణంలోనే అత్యధిక స్ధానాలున్న ప్రాంతం వ్యక్తికే చైర్మన్ పీఠం దక్కేలా చూడాలని డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Shivratri Fasting: శివరాత్రి ఉపవాసం.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలా ? అయితే ఈ చిట్కాలు పాటించండి

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×