E-Paper
Advertisement

ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!

ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!
Advertisement

Jagan Security: ఏపీ రాజకీయాల్లో సెక్యూరిటీ సెగ రాజకీయాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తోంది. మాజీ సీఎం జగన్‌ భద్రతపై ఇప్పుడు ఢిల్లీ పీఠం దాకా రగడ ముదిరింది. జిల్లాల పర్యటనల్లో జగన్‌కు వరుసగా భద్రతా వైఫల్యాలు ఎదురవుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ పర్యటనల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, కావాలనే సెక్యూరిటీని తగ్గించారంటూ ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది.

వైసీపీ ఎంపీల బృందం..

స్థానికంగా పోలీసులకు, డీజీపీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వైసీపీ ఎంపీల బృందం నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి లేఖ అందించడం సంచలనంగా మారింది. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో కాక రేపుతోంది. ఇదంతా వైఎస్సార్‌సీపీ ఆడుతున్న పక్కా పొలిటికల్ డ్రామా అని టీడీపీ విమర్శిస్తోంది.

Advertisement

Also Read: అసలు యూపీఐ అంటే ఏంటి? ఎలా పనిచేస్తోంది? ఉచిత సేవలకు అయ్యే ఖర్చెంత?

ఒకవైపు భద్రతా వైఫల్యం..

ప్రజాదరణ తగ్గుతోందనే భయంతో, మైలేజ్ కోసమే కావాలని జనాన్ని తోసి గొడవలు సృష్టిస్తోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. భద్రతను నెపంగా చూపి సానుభూతి పొందేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోందనేది టీడీపీ వర్గాల వాదన. ఒకవైపు భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షం పోరాటం.. మరోవైపు పబ్లిసిటీ స్టంట్ అంటూ అధికార పక్షం తిరుగుబాణంతో ఏపీలో సెక్యూరిటీ రాజకీయం తీవ్రస్థాయికి చేరింది. ఈ సెక్యూరిటీ వార్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ వరకు వెళ్లడంతో.. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతాయో.?

Advertisement

Also Read: విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. గన్నవరం మెట్రో లైన్‌పై కీలక ముందడుగు!

Tags

Related News

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×